Beauty Tips

Cracked Heels :ఈ 1 చిట్కా పాటిస్తే మీ కాలి పగుళ్లు శాశ్వతంగా మాయం అవుతాయి…ఇది నిజం

Cracked Heels : పాదాల పగుళ్లు అనేవి పొడి గాలి, తేమ సరిగా లేకపోవటం, పాదాలపై సరైన శ్రద్ద పెట్టకపోవటం వంటి కారణాలతో వస్తాయి. పాదాల పగుళ్లను అశ్రద్ద చేయకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు,ధైరాయిడ్ సమస్య ఉన్నవారు అసలు అశ్రద్ద చేయకుండా పాదాల పగుళ్లను తగ్గించుకోవాలి. వీరిలో ఎక్కువగా పాదాల పగుళ్ళ సమస్య కనపడుతుంది.
Feet Care Tips
పాదాల పగుళ్లను తగ్గించుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో పాదాల పగుళ్ళ సమస్య నుండి బయట పడవచ్చు. చిట్కా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
Eating raw onion with meals health benefits telugu
ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ జ్యూస్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ బేకింగ్ సోడా,రెండు స్పూన్ల టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలు పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాసి మూడు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి.

అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పాదాల పగుళ్లు తగ్గి మృదువుగా మారతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.