Kitchenvantalu

Bendakaya Annam: బెండకాయ అన్నం ఇలా రుచిగా చేసి పెట్టండి.. కమ్మగా తింటారు

Bendakaya Annam: బెండకాయ అన్నం ఇలా రుచిగా చేసి పెట్టండి.. కమ్మగా తింటారు..స్కూల్ కు వెళ్లే పిల్లలు ఉన్నారంటే, ఇంట్లో పొద్దున్నే హడావుడి మొదలవుతుంది. ఒక వైపు వాళ్లను రెడీ చేయడం ,ఇంకో వైపు బాక్స్ ప్రిపేర్ చేయడం,ఇంత హడావిడిలో పిల్లలు ఇష్టంగా తినే కూరలు,చేయడం కొంచెం కష్టం.

అలాగే టైమ్ టేకింగ్ కూడా.. వారి కోసం తక్కువ సమయంలో ఇష్టంగా తినే బెండకాయ అన్నం మీకోసం.. ఇదీ కాని లంచ్ లో యాడ్ చేసారంటే మదర్స్ కు మార్నింగ్ ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్స్ ఖాలీగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం బెండకాయ అన్నం ఎలా తయారు చేసుకోవాలో తెల్సుకుందాం.

కావాల్సిన పదార్థాలు

ఉడికిన అన్నం – రెండు కప్పులు
బెండకాయలు – 1/4 kg
ఎండుకొబ్బరి – చిన్నముక్క
ఉప్పు – తగినంత
పసుపు – 1/2 టీస్పూన్
పల్లీలు – 1 టేబుల్ స్పూన్
పుట్నాలు – 3 టేబుల్ స్పూన్స్
జీడిపప్పులు – 1 టేబుల్ స్పూన్ ( ఆప్షనల్)
ధనియాలు – 1/2 టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 10
గరం మసాలా – 1/2 టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
ఎండుమిర్చి – 2
నూనె – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1/2 టీ స్పూన్
జీరకర్ర – 1/2 టీ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా..

తయారి విధానం

1.పొడిపొడిగా వండిన అన్నం ..రెండు కప్పులు తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
2.శుభ్రం చేసుకున్న బెండకాయలను తడి లేకుండా, తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
3. స్టవ్ పై బాండి పెట్టుకుని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
4. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత, కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ పైన వేపుకోవాలి.
5. రెండు నిముషాలు వేగనివ్వాలి.
6. రెండు నిముషాల తర్వాత, ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి బెండకాయలు మగ్గనివ్వాలి.
7. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
8. ఒక మిక్సీ జార్ లోకి , కొబ్బరి, పుట్నాలు, ధనియాలు, కారం, వెల్లుల్లి రెమ్మలు, గరం మసాలా, వేసి,
కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
9. వేగిన బెండకాయలను ఒక గిన్నెలో తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
10. అదే బాండీలో మరో టేబులు స్పూన్ ఆయిల్ వేసుకుని, వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, జీరకర్ర వేసుకుని, చిటపట లాడుతుండగా, పల్లీలు, జీడిపప్పులు వేసి వేయించుకోవాలి.
11.దోరగా వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసుకుని, మరి కాసేపు వేయించాలి.
12. బాగా వేగాక , ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను, యాడ్ చేసి, కలుపుకోవాలి.
13. అందులోకి అన్నం , తయారు చేసుకున్న పొడిని, యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. టేస్ట్ కు సరిపడా ఉప్పు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి చివరగా కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే బెండకాయ అన్నం రెడీ .