Lungs health:వీటిని ఇలా తీసుకుంటే ఊపిరి తిత్తులలో పెరుకున్న కఫము, శ్లేష్మం శుభ్రం అయ్యి దగ్గు తగ్గుతుంది
Black Pepper And Cardamom Health benefits In Telugu : మిరియాలు, యాలకులు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దగ్గు వంటివి రాకుండా చూసుకోవాలి. విపరీతమైన మంచు ఉంది.
ఊపిరి తిత్తులలో పెరుకున్న కఫము, శ్లేష్మం తగ్గటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. దీని కోసం మిరియాల పొడి, యాలకుల పొడి, తేనె తీసుకోవాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ లో సగం యాలకుల పొడి, ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఉదయం,సాయంత్రం తాగితే మూడు రోజుల్లోనే తగ్గుతుంది.
Cardamom లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్దిగా ఉండటం వలన ఊపిరితిత్తులను ప్రభావితం చేసే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లను తగ్గిస్తుంది. అలాగే శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగు పరచటమే కాకుండా నాసికా మార్గం మరియు ఛాతీని క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్ లు దీర్ఘంగా ఊపిరి పీల్చుకునేలా చేసి ఆక్సిజన్ బాగా తీసుకొనేలా చేస్తాయి.
Black Pepper లో యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు ఉండటం వలన ఊపిరి తిత్తులలో పెరుకున్న కఫము, శ్లేష్మం శుభ్రం చేయటానికి సహాయ పడుతుంది. నల్ల మిరియాలు విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున, ఇది మంచి యాంటీబయాటిక్‌గా కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ డ్రింక్ ని వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.