Beauty Tips

Hair Fall Tips:షాంపూలో వీటిని కలిపి తలస్నానం చేస్తే చుండ్రు,జుట్టు రాలటం అనేది అసలు ఉండదు

Hair Fall And Dandruff home remedies : జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. చుండ్రు సమస్య వచ్చిందంటే ఒక పట్టానా వదలదు. ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడిన పెద్దగా ప్రయోజనం ఉండదు. చుండ్రు సమస్య ఉన్నప్పుడు జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో రెండు స్పూన్ల కాఫీ పొడి వేసి డికాషన్ తయారు చేసి ఒక బౌల్ లోకి వడకట్టాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల బియ్యాన్ని వేసి నీటిని పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఉల్లిపాయను రసం తీసుకోవాలి. అవిసే గింజలను నీటిలో నానబెట్టి జెల్ తీయాలి.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల షాంపూ, కాఫీ డికాషన్, బియ్యం నీరు,ఉల్లిపాయ రసం,అవిసే గింజల జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య క్రమంగా తొలగిపోవటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.