Kitchenvantalu

Saggubiyyam challa punukulu:సగ్గుబియ్యం చల్ల పునుగులు ఈ చిట్కాతో Oil అస్సలు పీల్చవు

Saggubiyyam challa punukulu: సగ్గుబియ్యం చల్ల పునుగులు ఈ చిట్కాతో Oil అస్సలు పీల్చవు.. సాయంత్రం అయిందంటే, పిల్లలు ఏదో ఒక స్నాక్స్ కావాలంటూ,అడుగుతూ ఉంటారు. రోజూ చేసినవే చేస్తే బోర్ అంటారు. కొత్తగా, వైరెటీగా సగ్గుబియ్యం పునుగులు ఎందుకు ట్రై చేయకూడదు.

కావాల్సిన పదార్థాలు

సగ్గుబియ్యం – 1 కప్పు
బియ్యం పిండి – 1 కప్పు
గోధుమ పిండి – 2 టేబుల్ స్పూన్స్
పుల్లటి పెరుగు – 1 కప్పు
జీలకర్ర – 1/2 టీ స్పూన్
ఉల్లిపాయ – మీడియం సైజ్
కరివేపాకు – రెమ్మ
పచ్చిమిర్చి- 2
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – తగినంత
వంట సోడా – తగినంత
ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం

1.ఒక మిక్సింగ్ బౌల్ లో , సగ్గుబియ్యం, పెరుగు, హాఫ్ కప్పు వాటర్, కలుపుకుని, రెండు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టాలి.

2. నానిన సగ్గుబియ్యంలో జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బియ్యంపిండి, గోధుమపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.

3. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, కొంచెం జారుగా రెడీ చేసుకోవాలి.

4. పునుగులు వేసే ముందు వంట సోడా యాడ్ చేసి, మరోసారి కలుపుకోవాలి.

5. స్టవ్ పై బాండీ పెట్టి, ఆయిల్ పోసి బాగా వెడెక్కనివ్వాలి.

6. కొద్దిగా కొద్దిగా పిండి తీసుకుని చిన్న చిన్న పునుగులు ఆయిల్లో వేసుకోవాలి.

7. మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకుని, ప్లేట్ లో సెర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం పునుగులు రెడీ అయినట్లే.