Alasanda Vadalu: నూనె పీల్చకుండా వేడి వేడిగా కారంగా కరకరలాడే వడలు
Alasanda Vadalu: నూనె పీల్చకుండా వేడి వేడిగా కారంగా కరకరలాడే వడలు..అలసంద గారెలు..వింటే రామాయణమే వినాలి.తింటే గారెలే తినాలి. మరి గారెల్లో అలసంద గారెలు రుచి చూడకపోతే ఎలా?
కరకరలాడే అలసంద గారెలు,ఆరోగ్యానికి ఆరోగ్యం,నోటికి పసందైన వంటకం. ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి.
కావాల్సిన పదార్ధాలు
అలసందలు – 1/2 KG
ఉల్లిపాయ – 2 మీడియం సైజ్
కరివేపాకు – 2 రెమ్మలు
పచ్చిమిర్చి –3 లేదా 4
అల్లం – 2 ఇంచులు
జీలకర్ర – 1/2 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
1.అరకేజీ అలసందలు తీసుకుని, నీళ్లు పోసి ఐదారు గంటలు నానబెట్టుకోవాలి.
2. నానిన అలసందలు శుభ్రంగా కడిగి వడగట్టుకోవాలి.
3.ఒక మిక్సీ జార్ లో కొద్ది కొద్దిగా అలసందలు బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
4. గ్రైండ్ చేసిన అలసంద పేస్ట్ ను మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర,ఉప్పు వేసుకుని, బాగా కలుపుకోవాలి.
6. ఒక తడ్డి గుడ్డను పీట పై పరుచుకుని, మధ్య మధ్యలోచేయిని నీళ్లలో తడుపుతూ, కొద్ది కొద్ది పిండి తీసుకుని తడిగుడ్డ పై గారెలు వత్తుకోవాలి.
7.స్టవ్ పై బాండీ పెట్టుకుని ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి.
8. నూనె వేడెక్కిన తర్వాత, వత్తుకున్న గారెలను నెమ్మదిగా నూనెలోకి వదలాలి.
9. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని, గారేలు రెండు వైపులా తిప్పుతూ, వేగనివ్వాలి. వేగిన గారెలను ప్లేట్లోకి తీసుకుని ఆరగిస్తే సరి.