Kitchenvantalu

Godhuma pindi punugulu:గోధుమ పిండి తో ఇలా చిట్టిచిట్టి పునుగులు ఈజీ గాఇంట్లోనే చేసుకోండి

Godhuma pindi punugulu:గోధుమ పిండి తో ఇలా చిట్టి చిట్టి పునుగులు ఈజీ గాఇంట్లోనే చేసుకోండి.. సాయంత్రం అయిందంటే చాలు, చూపు వంటింటి వైపు వెళ్తుంది.ఏదో ఒక స్నాక్స్ తినాలని,మనసు లాగేస్తుంటుంది.

వేడి వేడిగా టీ లాగించే ముందు,లైట్ గా ఉండే గోధుమ పిండి పునుగులు నోట్లో పడితే,ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి – 1 ½ కప్పు
పుల్లటి పెరుగు – 1 కప్పు
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1/2 టీ స్పూన్
పచ్చిమిర్చి -2
కరివేపాకు – రెండు రెమ్మలు
వంట సోడా – ¼ టీ స్పూన్
ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం

1. ఒక మిక్సింగ్ బౌల్ లోకి గోధుమపిండి, పెరుగు వేసి కలుపుకోవాలి.

2. కొద్దికొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ, కొంచెం జారుగా, పునుగులు వేసుకోవడానికి వీలుగా, ఉండేలా బ్యాటర్ ను తయారు చేసి 5 గంటల పాటు పక్కనపెట్టండి.

3. నానిన బ్యాటర్ లో పచ్చిమిర్చి కరివేపాకు, జీలకర్ర, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి.

4. స్టవ్ పై బాండీ పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, వేడి చేయాలి.

5. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా, పిండిని ఆయిల్ లోకి వదలాలి.

6. పునుగులను అటూ ఇటూ తిప్పుతూ మీడియం ఫ్లేమ్ పై ఎర్రగా కాలనివ్వాలి.

7. వేగిన పునుగులను ప్లేట్ లో సెర్వ్ చేసుకుంటే సరి.