Tomato Methi Pappu:ఓసారి ఇలా పప్పు చేసిపెట్టండి సూపర్ అంటారు
Tomato Methi Pappu:ఓసారి ఇలా పప్పు చేసిపెట్టండి సూపర్ అంటారు..ఎన్ని కూరగాయలున్నా,ఎన్ని వెరైటీస్ చేసుకున్నా ,వారంలో రెండు, మూడు రోజులైనా పప్పు స్పెషల్ ఉండాల్సిందే, వండి తీరాల్సిందే.
మరి మెంతికూర టోమాటో పప్పు ఎప్పుడైనా ట్రై చేసారా?..లేదా అయితే ఇప్పుడే చేసేయండి.
కావాల్సిన పదార్ధాలు
కందిపప్పు – 1½ కప్పు
మెంతికూర – రెండు కట్టలు
టమాట – మూడు ( మీడియం సైజ్)
పచ్చిమిర్చి – 6
ఎండుమిర్చి -4
పసుపు – 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 7 లేదా 8
చింతపండు – కొద్దిగా
ఆయిల్ – 2 టెబుల్ స్పూన్
ఉల్లిపాయ – మీడియం సైజ్
తాలింపు గింజలు – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు రెమ్మ – 1
ఉప్పు – తగినంత
తయారీ విధానం
1. స్టవ్ పై పాన్ పెట్టుకుని కందిపప్పును దోరగా వేయించుకోవాలి.
2. తగినన్ని నీళ్లు పోసి వేయించుకున్న కందిపప్పును శుభ్రంగా కడగండి.
3. వడకట్టిన పప్పులోకి మెంతికూర , టమాటలు , పసుపు, వేసుకుని, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని,
మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి.
4. ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
5. ఉడికించిన పప్పును , పప్పుగుత్తి సాయంతో మెత్తగా రద్దుకోవాలి.
6. ఇందులోకి చింతపండు నీళ్లు కలుపుకుని,తగినన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
7. వేరొక బాండి స్టవ్ పై పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని , నూనె వేడెక్కిన తర్వాత,
తాలింపు గింజలు , పొడుగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, వేసుకుని అందులోకి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి.
8. ఒక నిముషం వరకు కలుపుతూ , ధనియాల పొడి కూడా యాడ్ చేసి, పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
9. ఇప్పుడు ఉడికించిన పప్పు తాలింపులో వేసుకుని, తగినన్ని నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి.
10. మీడియం ఫ్లేమ్ పై మరో 5 నిముషాలు ఉడికించుకుంటే , మెంతికూర టమాటో పప్పు రెడీ.