Annamayya movie:అన్నమయ్య సినిమాలో ఈ గెటప్ వేసుకోవటానికి ఎంత సమయం పట్టేదో తెలుసా?
Annamayya movie:అన్నమయ్య సినిమాలో ఈ గెటప్ వేసుకోవటానికి ఎంత సమయం పట్టేదో తెలుసా.. మన టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ఈ పాత్రకు ఈయనయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అని పలు సినిమాలు తీస్తుంటారు.
కానీ ఒక బెంచ్ మార్క్ లాగా ఎప్పటికీ ఈ రోల్ లో ఈయన కనిపిస్తే ఎక్కడా కూడా చిన్న వంక చూపించలేని విధంగా ఇమిడిపోయిన వారు కూడ ఉన్నారు.అయితే అలాంటి పాత్రల్లో ఎక్కువగా డివోషనల్ పాత్రలు అంటే దేవుళ్ళ పాత్రలలో నటించే వారు కాస్త కీలకం అని చెప్పాలి.
అలా మన తెలుగులో వచ్చినటువంటి సినిమాల్లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు నాగార్జున హీరోగా తెరకెక్కించిన భక్తి రస చిత్రం “అన్నమయ్య” ఒకటి అందులో సాక్ష్యాత్తు ఆ తిరుమలేశుని చూసిన విధంగా చాలా చూడ ముచ్చటగా నటుడు సుమన్ ను చూపించారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఒక బెంచ్ మార్క్ లా నిలబడింది.
అయితే అసలు ఆ పాత్ర కోసం ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డారో సుమన్ “ఆలీతో సరదాగా” షోలో తెలిపారు.అప్పట్లో ఆ గెటప్ కు దాదాపు 4 గంటల సమయం పట్టేది అని తెల్లవారు జామున 5 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్ళిపోతే 9 గంటలకు పూర్తయ్యేది అని కిరీటం పెట్టేసాక మళ్ళీ అది 12 గంటల వరకు తీసేవాడిని కాదని అలా 8 నెలల పాటు చేశామని సుమన్ తెలిపారు.