Devotional

Ashadha Amavasya Date 2024: ఆషాఢ అమావాస్య రోజు ఇలా చేస్తే చాలు.. మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది

Ashadha Amavasya Date 2024: ఆషాఢ అమావాస్య రోజు ఇలా చేస్తే చాలు.. మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది.. ఈ సంవత్సరం ఆషాడమాసం జూలై 6 న ప్రారంభం అవుతోంది.. ఆగష్టు 4న అమావాస్య వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

ఈ సంవత్సరం ఆషాఢ అమావాస్య ఆదివారం వచ్చింది. ఆషాడమాసం, ఆదివారం అత్యంత పవర్ ఫుల్ అని పండితులు చెప్పుతూ ఉంటారు. హిందువులు ఆషాఢ అమావాస్య రోజు పితృ తర్పణాలిస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని.. తద్వారా వంశ వృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు. అలాగే ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయని ఒక నమ్మకం.

ఆగష్టు 03 శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు అమావాస్య ఘడియలు ప్రారంభై… ఆగష్టు 04 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 54 నిముషాలవరకూ ఉన్నాయి. ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు.. కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజే పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆగష్టు 04న ఆషాడ అమావాస్య వచ్చింది. ఆ రోజే పితృదేవతలకు తర్పణాలు విడవాలి.

పితృ దేవతల ఆశీస్సులు ఉండాలన్నా.. పితృ దోషం ఉన్నవారు ఆషాడ అమావాస్య రోజు ఆలయాలకు వెళ్లి భగవంతుడికి నమస్కరించి…అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూలచెట్టుకింద ఆవనూనెతో దీపం వెలిగించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.