Tomato Face Pack:టొమాటో గుజ్జును ముఖంపై రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే..!!
Tomato Face Pack:టొమాటో గుజ్జును ముఖంపై రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే.. టొమాటో సహజసిద్ధమైన స్కిన్ టోనర్. మొటిమలు, కురుపులు వంటి వాటిని నయం చేస్తుంది. తాజా టొమాటోలను బ్లెండర్ లేదా గ్రైండర్‌లో వేసి గుజ్జులా చేయాలి. ఈ టొమాటో గుజ్జును ముఖానికి రాసుకుని పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి.
రోజూ ఇలా చేస్తే చర్మంపై పెద్దగా కనిపించే రంధ్రాలు మూసుకుపోతాయి. మొటిమలు తగ్గించేందుకు టొమాటో గుజ్జు చాలా బాగా పనిచేస్తుంది. మొటిమల మీద గుజ్జు ఉంచి గంట తరువాత కడిగేయాలి.పుదీనాలో ఉండే మెంథాల్ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. మొటిమలు తొలగించుకోవాలంటే తాజా పుదీనా రసాన్ని ప్రతిరోజూ రాత్రి సమయంలో ముఖానికి రాసుకోవాలి.
పుదీనా ఆకుల్లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి గుజ్జులా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకుని పావుగంట తరువాత కడిగేయాలి. వారంలో కొన్నిసార్లు ఇలా చేస్తే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. చర్మానికి సంబంధించిన పలు రకాల సమస్యలను నయం చేసేందుకు పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇత ఆ తర్వాత…
ఒక టేబుల్‌స్పూన్ పసుపులో సరిపడా పాలు పోసి పేస్ట్‌లా చేయాలి. ముఖం, మెడ భాగాలకు ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. మచ్చలు కూడా మటుమాయం అవుతాయి.
పొడిబారిన చర్మానికి ఒక టీస్పూన్ పసుపు, రెండు టీస్పూన్ల గంధం పొడి, సరిపడా నీళ్లు (రోజ్ వాటర్ అయినా వాడొచ్చు) కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా ఆరనివ్వాలి. వారానికి రెండుసార్లు ఈ మాస్క్ వేసుకుంటే బాగుంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.