Egg Drumstick curry:ఎంతో రుచికరమైన కోడిగుడ్డు ములక్కాడ Curry Taste చేసి చూడండి
Egg Drumstick curry:ఎంతో రుచికరమైన కోడిగుడ్డు ములక్కాడ Curry Taste చేసి చూడండి.. ములక్కాయ కోడిగుడ్డు Curry..ఏ వంటకం అయినా,
చేసినవే చేస్తుంటే బోర్ కొడుతుంది.తిన్నవే తినాలంటే విసుగ్గా ఉంటుంది.
కొత్త కొత్త గా ట్రై చేస్తేనే,చేసేవారికి ఇంట్రెస్ట్,తినేవారికి ఎగ్జైట్ మెంట్ ఉంటుంది.అందుకే స్పెషల్ గా ములక్కాయ కోడిగుడ్డు చేసేసుకోండి.
కావాల్సిన పదార్థాలు
గుడ్లు – 5
ములక్కాడ – 1 పెద్దది
నూనె – 3 టేబుల్ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
వెల్లుల్లి రెమ్మలు – 5
పచ్చిమిర్చి – 2
ఉల్లిపాయ -1
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
టమాటలు – 4
కారం – రుచికి సరిపడా
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా గడ్లను పొట్టు తీసి పక్కనపెట్టుకోవాలి.
2. ములక్కాడలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి
3.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత, జీలకర్ర,ఆవాలు, వేసుకోండి.
4. జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని, రెండు పచ్చిమిర్చి వేసుకోండి.
5.పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ , పసుపు యాడ్ చేసుకుని, కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలను యాడ్ చేసి బాగా కలపాలి.
6.లో ఫ్లైమ్లో మూత పెట్టుకుని రెండు నిముషాలు వేగనివ్వాలి.
7. మగ్గిన ములక్కాడల్లోకి కట్ చేసి పెట్టిన టమాట ముక్కలు యాడ్ చేసుకోండి.
8.మూత పెట్టుకుని మరో 5 నిముషాలు మగ్గనివ్వండి.
9. ఇప్పుడు అందులోకి కారం , ధనియాల పొడి యాడ్ చేసి బాగా కలపుకోండి.
10. అరగ్లాస్ నీరు పోసి బాగా కలిపి, అందులో ఉడికించిన గుడ్లకి ఫోర్క్ తో గుచ్చి వేసుకోండి.
11. ఇప్పుడు యాడ్ చేసుకున్న గుడ్లను ములక్కాడలతో బాగా కలిపి మూత పెట్టుకుని, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోండి.
12.చివరగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ములక్కాడ కోడిగుడ్డు కూర రెడీ.