Millets laddu:రోజుకి 1 లడ్డు తింటే అధిక బరువు, ధైరాయిడ్ సమస్యలు అసలు ఉండవు
Millets laddu Health Benefits In Telugu :ఈ మధ్య కాలంలో Millets వాడకం చాలా ఎక్కువ అయింది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా థైరాయిడ్., డయాబెటిస్, అధిక బరువు అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు జీవితకాలం తప్పనిసరిగా మందులను వాడాలి. అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే లడ్డు తీసుకుంటే మంచిది.
ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చిరుధాన్యాల వాడకం ఎక్కువ అయ్యింది. చిరు ధాన్యాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చిరు ధాన్యాలలో ఒకటైన అరికెలతో లడ్డు తయారు చేసుకుని ప్రతిరోజు ఒక లడ్డు తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్ని అందుతాయి. లడ్డు ఎలా తయారుచేయాలో చూద్దాం.
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి వేడి అయ్యాక రెండు కప్పుల అరికెల పిండి వేసి బాగా వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అదే పాన్ లో అర కప్పు వేరుశెనగ గుళ్ళు వేసి వెగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అరకప్పు నువ్వులు వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసి వేగించి పక్కన పెట్టాలి. .
మిక్సీ జార్ లో వేగించి పెట్టిన వేరుశనగ గుళ్ళు,నువ్వులు,ఎండు కొబ్బరి, అరికెల పిండి, ఒక కప్పు బెల్లం వేసి మిక్సీ చేసి ఒక బౌల్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమంలో అరకప్పు బాదం పప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి…నెయ్యి వేస్తూ చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.
ఈ లడ్డూలు దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రతి రోజు ఒక లడ్డు తింటే ధైరాయిడ్,డయాబెటిస్,అధిక బరువు సమస్యల నుండి బయట పడవచ్చు. అలాగే నీరసం,అలసట, నిస్సత్తువ వంటివిఎమి లేకుండా హుషారుగా ఉంటారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఈ లడ్డులను తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.