Healthhealth tips in telugu

Good Sleep:చిటికెడు గింజలు నోట్లో వేసుకుంటే చాలు గాఢ నిద్ర పడుతుంది

Good Sleep:చిటికెడు గింజలు నోట్లో వేసుకుంటే చాలు గాఢ నిద్ర పడుతుంది.. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. నిద్రలేమి సమస్యతో ఉన్నప్పుడు నిద్ర సరిగా పట్టక అలసట,నీరసం,ఏ పని చేయాలనే కోరిక లేకపోవటం వంటి సమస్యలు వస్తాయి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే నిద్రలేమి సమస్య ఉన్నవారికి గాఢ నిద్ర పడుతుంది. మన వంటింటిలో ఉండే గసగసాలను తగిన మోతాదులో తీసుకుంటే నిద్రను ప్రేరేపించి నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. అరస్పూన్ గసగసాలను మెత్తగా నూరి ఒక గ్లాస్ పాలల్లో కలిపి బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

ఈ విధంగా చేస్తే రెండు రోజుల్లోనే నిద్రలేమి సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే గసగసాలను ఇలా తీసుకోవటం వలన వీటిలో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే కంటి సమస్యలను తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. గసగసాలను లిమిట్ గా తీసుకోవాలి. మోతాదు మించితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.