DevotionalHealthhealth tips in telugu

Lifestyle: ఏ వైపు పడుకుంటే మంచిది.? నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..

Lifestyle: ఏ వైపు పడుకుంటే మంచిది.? నిపుణులు ఏం సూచిస్తున్నారంటే.. మనం ప్రతిరోజు నిద్రపోతాం కానీ మనలో చాలామందికి తల ఎటు పెట్టాలి ఎటువైపు పెట్టాలి అనే విషయం తెలియదు. నిద్ర వచ్చింది కదా అని అలా ఎలా పడితే అలా పడుకుంటు ఉంటారు.

చాలామంది పడమర వైపు తల పెట్టుకుని పడుకుంటారు తల ఉత్తరం పడమర వైపు పెట్టి పడుకుంటే మృత్యు సంభవిస్తుందని అర్థం. పడమర వైపు తల పెట్టి పడుకోవటం కాల్ టు తూర్పు వైపు ఉంటాయి.తూర్పు వైపు అంటే సూర్యుని వైపు ఉండటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఉత్తరం వైపు తల పెట్టుకుని ఉంటే కాళ్లు దక్షిణం వైపు ఉంటాయి. ఉదయం లేచిన వెంటనే కళ్ళు తెరవగానే దక్షిణం వైపు యమ స్థానం కాబట్టి ఆ వైపు చూడ కూడదు. తలను తూర్పు లేదా దక్షిణం వైపు పెట్టుకోవడం వలన ఎలాంటి సమస్యలు ఉండవు తూర్పు వైపు తల పెట్టి పడుకుంటే జ్ఞాపకశక్తి పెరిగి బావుంటుంది. దక్షిణం వైపు తల పెట్టుకుని ఉంటే నిద్ర బాగా పడుతుంది.

గుండె జబ్బులతో బాధపడే వారు కుడి వైపున నిద్రించాలి. ఇలా పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.

గర్భిణిలు కూడా ఎడమ వైపు నిద్రిస్తే గుండెల్లో మంట, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

బోర్లా పడుకుంటే తలకింద దిండు పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనికి బదులుగా మోకాళ్ల కింద దిండు పెట్టుకోవాలని చెబుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.