Tulasi:ప్రతి ఇంట్లో ఉండే తులసి మొక్క గురించి ఈ విషయాలు తెలుసా..?
Tulasi benefits:ప్రతి ఇంట్లో ఉండే తులసి మొక్క గురించి ఈ విషయాలు తెలుసా.. తులసి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న మొక్క. . దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్ (Ocimum tenuiflorum). తులసిలో రెండు రకాలు ఉన్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామ తులసి అని పిలుస్తారు.
వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు మరియు ఆయుర్వేద ఔషధాలలో అధికంగా వాడుతారు. తులసిని పూజలలోనే కాకుండా ఆరోగ్య పరంగా కూడా చాలా విరివిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం తులసి ఆకులలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
తులసిలో క్రిమినాశక లక్షణాలు ఉండుట వలన అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. తులసి పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మొటిమలు తగ్గటమే కాకుండా నల్లని మచ్చలు కూడా తగ్గిపోతాయి. అంతేకాక చర్మం కాంతివంతంగా మారుతుంది.
తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటి బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మం తొందరగా వృద్దాప్య లక్షణాలకు గురి కాకుండా యవ్వనంగా ఉంటుంది.
కొబ్బరి నూనెలో కొన్ని తులసి ఆకులను వేసి గోరువెచ్చగా చేసి ఆ నూనెను తలకు రాసి మర్దన చేస్తే తల మీద చర్మానికి తేమ బాగా అంది రక్తప్రసరణ బాగా అందుతుంది. దాంతో చుండ్రు,మంట,దురద వంటి సమస్యలు అన్ని తగ్గిపోతాయి.
ఒక కప్పు నీటిలో పది తులసి ఆకులు,5 లవంగాలు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి త్రాగుతూ ఉంటే దగ్గు,జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజు 3 తులసి ఆకులను తింటూ ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.