Healthhealth tips in telugu

Barley Water:ఈ గింజలను ఫిల్టర్ చేసి తాగితే కిడ్నీలో రాళ్ళు కరగటమే కాకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి

Barley Water:ఈ గింజలను ఫిల్టర్ చేసి తాగితే కిడ్నీలో రాళ్ళు కరగటమే కాకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.. బార్లీ గింజలను ఒకప్పుడు ఎక్కువగా వాడేవారు. మరల ఇప్పుడు మారిన జీవనశైలి పరిస్థితి అలాగే మారిన పరిస్థితులు కారణంగా బార్లీ నీటిని తాగటం ప్రారంభించారు. ముఖ్యంగా వేసవిలో బార్లీ నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ గింజలను రఫ్ గా మిక్సీ చేసుకోవాలి.

పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి రెండు స్పూన్ల బార్లీని వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగిస్తే బార్లీలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ నీటిని తాగటం వలన శరీరంలో వ్యర్ధాలు అన్నీ బయటకు పోతాయి. మూత్రాశయం శుభ్రంగా ఉంటుంది. యూరిన్ ఎక్కువగా అయ్యి కిడ్నీలో ఉండే చిన్న చిన్న రాళ్ళు కరిగిపోయి బయటకు పోతాయి.

మూత్రాశయంలో ఇన్ ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుంది. బార్లీ నీటిని తాగటం వలన మూత్రాశయం సమస్యలు తగ్గటమే కాకుండా వేసవిలో వడదెబ్బ నుండి రక్షణ కలుగుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారే కాకుండా అందరూ బార్లీ నీటిని తాగవచ్చు. అధిక బరువు ఉన్నవారిలో శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది.

బార్లీలో విటమిన్ బీ6 మరియు మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. రాళ్లుగా మారే calcium ఆక్సలేట్ ను చిన్న చిన్న పీసెస్ గా మార్చే సామర్థ్యం బార్లీ నీళ్లకు కలదు. అందువల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారు బార్లీ నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.