Healthhealth tips in telugu

Eye Care Tips:ఈ పొడిని15 రోజులు ఇలా తీసుకుంటే మసక తగ్గి కళ్ళు క్లియర్ గా కనపడతాయి

Eye Care Tips:ఈ పొడిని15 రోజులు ఇలా తీసుకుంటే మసక తగ్గి కళ్ళు క్లియర్ గా కనపడతాయి.. ఈ మధ్య కాలంలో కంప్యూటర్ వాడకం, స్మార్ట్ ఫోన్స్ వాడకం చాలా ఎక్కువ అయ్యి కంటికి సంబందించిన సమస్యలు వస్తున్నాయి.

కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే మనం తీసుకొనే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలను తీసుకుంటే కంటి చూపు మెరుగు అవుతుంది. అలాగే కంటికి సంబందించిన సమస్యలు ఏమి ఉండవు. అలాంటి ఆహారాలలో కరివేపాకు ఒకటి.

కరివేపాకును ప్రతి రోజు వంటల్లో వాడుతూ ఉంటాం. చాలా మంది కరివేపాకును కూరల్లో ఏరి తీసి పాడేస్తూ ఉంటారు. అలా పాడేయకుండా తింటే మంచిది. కరివేపాకును పొడిగా చేసుకొని ప్రతి రోజు భోజనం సమయంలో మొదటి ముద్దలో కరివేపాకు పొడి కలిపి తింటే సరిపోతుంది. ఇలా 15 రోజుల పాటు తింటే కంటికి సంబందించిన సమస్యలు తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

కరివేపాకు కంటి చూపుకు చాలా మంచిది. కరివేపాకులో విటమిన్ ఎ చాలా సమృద్దిగా ఉంటుంది. విటమిన్ ఎ కార్నియాను రక్షించే కెరోటి నాయిడ్లను కలిగి ఉంటుంది. విటమిన్ ఎ లోపం వల్ల కంటిశుక్లం, రాత్రి అంధత్వం మొదలైన కంటి సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి దృష్టి ఆరోగ్యానికి కరివేపాకులను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.