Coconut oil For Hair:కొబ్బరి నూనెను ఇలా వాడితే జుట్టు నెల రోజుల్లోనే రెట్టింపు అవుతుంది
Coconut For Hair:కొబ్బరి నూనెను ఇలా వాడితే జుట్టు నెల రోజుల్లోనే రెట్టింపు అవుతుంది.. జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలకు ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేయాలి. మనలో చాలా మంది జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగాలని కోరుకుంటారు.
దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వేల కొద్ది డబ్భును ఖర్చుపెట్టి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. అయితే వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంటిలో సహజ సిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్యను తగ్గించుకొని జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది.
మనం రెగ్యులర్ గా వాడే కొబ్బరి నూనె జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మనం కొబ్బరి నూనెను ఎలా వాడితే జుట్టు రాలకుండా పొడవుగా పెరుగుతుందో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కరివేపాకు, మూడు స్పూన్ల మెంతులు, ఆరు లవంగాలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేయాలి.
ఆ తర్వాత పొయ్యి వెలిగించి మందపాటి గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాసు కొబ్బరి నూనె పోసి కొంచెం వేడి అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం వేయాలి. ఆ తర్వాత రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఈ నూనెను 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత చల్లారపెట్టాలి.
ఈ ఆయిల్ బాగా చల్లారిన తర్వాత వడగట్టి ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను రాత్రి పడుకోవడానికి ముందు జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.