Beauty Tips

Rice Water For Face:బియ్యం కడిగిన నీళ్ళను ముఖానికి రాస్తున్నారా.. ఈ నిజాలు తెలుసా..?

Rice Water For Face:బియ్యం కడిగిన నీళ్ళను ముఖానికి రాస్తున్నారా.. ఈ నిజాలు తెలుసా.. మన వంటింటిలో ఉండే వస్తువులలో ఎన్నో ఆరోగ్య,బ్యుటి ప్రయోజనాలు దాగి ఉంటాయి. అయితే వాటి గురించి తెలియక పెద్దగా పట్టించుకోము. అయితే ఇప్పుడు చెప్పే విషయం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం ప్రతి రోజు బియ్యం కడిగి అన్నం వండుతూ ఉంటాం. అయితే ఆ నీటిని ఏమి చేస్తాం? పారబోస్తాం. ఆ బియ్యం కడిగిన నీటిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Face Beauty Tips In telugu
ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అసలు బియ్యం కడిగిన నీటిని పారబోయరు. బియ్యం కడిగిన నీటికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు ,బ్యూటీ సమస్యాలకు పరిష్కారం చూపుతుంది. బియ్యం కడిగిన నీటిలో ఖనిజాలు,విటమిన్స్, అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.

బియ్యం కడిగిన నీటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. బియ్యాన్ని ముందుగా గిన్నెలో పోసి నీటిని పోసి రెండు సార్లు కడిగితే దుమ్ము ధూళి తొలగిపోతాయి. ఇప్పుడు మరల నీటిని పోసి ఒక అరగంట ఆలా వదిలేయాలి. అరగంట అయ్యాక బియ్యాన్ని కలిపితే కాస్త మసకగా ఉన్న నీళ్లు బియంపైనా తేలుతాయి. ఈ నీటిని మరో పాత్రలోకి వంపాలి. అంతే బియ్యం ఆకడిగిన నీళ్లు రెడీ అయినట్టే. ఈ నీటిని ఫ్రిజ్ లో పెట్టుకొని రెండు,మూడు రోజులు వాడుకోవచ్చు.

బియ్యం కడిగిన నీళ్లతో(Rice Water) ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. బియ్యం ఆకడిగిన నీటిలో కాటన్ ముంచి ముఖానికి.మెడకు రాసుకొని రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ముఖం పూర్తిగా ఆరాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. విధంగా ప్రతి రోజు చేస్తే చర్మానికి అవసరమైన పోషణ అంది చర్మం మృదువుగా మెరుస్తుంది.

బియ్యం కడిగిన నీరు (Rice Water) మొటిమల సమస్యకు చక్కని పరిష్కారం. బియ్యం ఆకడిగిన నీటిలో కాటన్ ముంచి ముఖం మీద మొటిమలు ఉన్న ప్రదేశంలో ప్రతి రోజు రాస్తూ ఉంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. మొటిమల సమస్యే కాకుండా నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. బియ్యం కడిగిన నీళ్లు మంచి టోనర్ గా పనిచేస్తాయి. చర్మానికి రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. చర్మం మీద ఏర్పడిన రాష్,ఎలర్జీ లు కూడా తగ్గుతాయి.

తలకు షాంపూ పెట్టి తలస్నానము చేసాక బియ్యం కడిగిన నీటిని తలపై పోసుకొని 2 నిముషాలు మసాజ్ చేసుకుంటే జుట్టుకు పోషణ అంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఆ తర్వాత సాధారణ నీటిని తలపై పోసుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా పెరగటమే కాకుండా జుట్టుకు కండిషనర్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.