Beauty Tips

Hair Growth Tips:జుట్టు వేగంగా పెరగడం లేదని చింతిస్తున్నారా.. ఇలా చేస్తే సరి..

Hair Growth Tips:జుట్టు వేగంగా పెరగడం లేదని చింతిస్తున్నారా.. ఇలా చేస్తే సరి.. జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి, ఒత్తిడి,వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి.

అరకప్పు మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక అరటిపండు గుజ్జు, ఒక స్పూన్ అలోవెరా జెల్. ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టుకి అవసరమైన పోషణ అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

కలబందలో ఉండే విటమిన్ ఎ, సి మరియు ఇ.. జుట్టు మెరుపుకు మరియు డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. అరటిపండు జుట్టుకి మంచి పోషణను అందిస్తుంది.

మెంతి గింజల్లో ఉండే విటమిన్ ఎ, సి, కె, కాల్షియం మరియు ఐరన్.. స్కాల్ప్‌ను బలోపేతం చేసి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. ఈ ప్యాక్ లో తీసుకున్న అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి.

కలబంద మొక్క ఇంటిలో ఉండే తాజా జెల్ వాడితే మంచిది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే చాలా సులభంగా జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.