Face Glow Tips:వేప పొడిలో ఇది కలిపి రాస్తే చాలు.. నలుపు తగ్గి, ముఖం తెల్లగా మెరుస్తుంది..!
Neem Powder Face Pack: ముఖ సంరక్షణలో వేపను పురాతన కాలం నుండి వాడుతున్నారు. వేపలో ఉన్న లక్షణాలు ముఖం మీద ఏ సమస్యలు లేకుండా చేస్తుంది. వేప ఆకులను లేదా పొడిని వాడవచ్చు.
ముఖం తెల్లగా అందంగా ఉండాలని ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటాం. వాటి కారణంగా కొన్ని సార్లు చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దాంతో ఖరీదైన చికిత్సలు తీసుకుంటాం.
కానీ ఇప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పే ఫేస్ ప్యాక్ మీ చర్మంను క్లియర్‌గా మరియు మెరిసేలా చేస్తుంది. ఈ ప్యాక్ లో కేవలం నాలుగు ఇంగ్రిడియన్స్ వాడుతున్నాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ ముల్తానీ మిట్టి పొడి, అరస్పూన్ వేప పొడి, అరస్పూన్ గంధపు పొడి, ఒక స్పూన్ రోజ్ water, సరిపడా నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత నీటిని జల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మంపై ఉన్న అదనపు నూనెను తొలగిస్తుంది. దీంతో చర్మం ఈవెన్ టోన్‌గా కనిపిస్తుంది. చర్మంపై ఉన్న మురికి సులభంగా తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ ప్యాక్ వేసుకోవటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని ఇంగ్రిడియన్స్ మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. అలాగే చాలా తక్కువ ఖర్చులో ముఖ్నాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.