Devotional

Numerology:13 వ తేదీన జన్మించారా… మీ వ్యక్తిత్వం గురించి ఏమి తెలియజేస్తుందో తెలుసుకోండి

Numerology:13 వ తేదీన జన్మించారా… మీ వ్యక్తిత్వం గురించి ఏమి తెలియజేస్తుందో తెలుసుకోండి.. మనలో చాలా మంది జాతకాలు,న్యుమరలజి అంటూ ఎదో ఒక దానిని పట్టుకొంటారు.

మనలో కొంత మంది జాతకాలను నమ్ముతారు. అలాగే కొంత మంది జాతకాలను అసలు నమ్మరు. జాతకం చూసేటప్పుడు అన్ని యాంగిల్స్ లో చూస్తారు. జాతకంలో తేడాలుంటే,కొంతవరకూ ఉపశమనం పొందడానికి రెమిడీ కూడా జోతిష్యులు చెబుతుంటారు. ఇక అది ఏ నెల అయినా కావచ్చు, ఏ సంవత్సరం అయినా కావచ్చు.

ఫలానా తేదీన పుడితే సంఖ్యాశాస్రం ప్రకారం వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా చెబుతున్నారు. అందులో భాగంగా 13వ తేదీన జన్మించిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో చూద్దాం. సంఖ్యాశాస్రం ప్రకారం 1సూర్యునికి, 3గురు గ్రహానికి,ఈరెండు కలిపి ఇక సంఖ్య గా చేస్తే వచ్చే 4రాహు గ్రహానికి సంబంధించిందని నిపుణులు చెబుతున్నారు.

13వ తేదీన పుట్టినవారు చిన్నపుడు కుటుంబ బాధ్యతలు కావచ్చు మరొకటి కావచ్చు కష్టాలు ఎక్కువగా మోయాల్సి వస్తుంది. అయితే పెద్దయ్యే కొద్దీ,ఉన్నత స్థితికి చేరుతారు. అది ఏ రంగమైనా సరే, ఆ రంగంలో 13వ తేదీన పుట్టినవారు, చిన్న పని ప్రారంభించినా సరే,అది సులువుగా దక్కే ఛాన్స్ లు లేవు. ఏదైనా సరే పోరాడి సాధించుకోవాల్సిన ఉంటుంది.

ఇక పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటే వాటిని సాధించుకోడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. జీవితంలో ఎక్కువగా పోరాటలే ఉంటాయి. అయితే ఎక్కువ కష్టపడితే, శ్రమిస్తే, తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఉదాహరణకు ఎవరికైనా ఓ లక్ష్యం చేరుకోడానికి ఏడాది సమయం పడితే, 13వ తేదీన పుట్టినవారికి మాత్రం కనీసం రెండేళ్ల సమయం పడుతుందన్నమాట.

ఇక శత్రువులు అందరికీ వుంటారు. మనం ఏం చేస్తున్నా,వెనక్కి లాగే యత్నం చేస్తుంటారు. ఇది సహజం. అయితే, 13వ తేదీన పుట్టినవారు తనకు తెలివి తేటలున్న,కష్టపడుతున్నా సరే,ఏ పనీ అవ్వడం లేదని బాధ పడకుండా,దేవుని ధ్యానిస్తూ,నిగ్రహంగా,సహనంగా,నిజాయితీగా ఉంటూ , మరింత ఎక్కువ కష్టపడితే,ఆ పని పూర్తవుతుంది.

ఏదైనా చేసేటప్పుడు,ఓ ప్లాన్ వేసుకుని అదే విధంగా ముందుకు వెళ్తే, జీవితంలో విజయాలను అందుకుంటారు. ఇక 13వ తేదీన జన్మించిన వారు పేదరికంలో వున్నా సరే, జాలిగుండె కారణంగా ఇతరులకు సాయపడే గుణం ఎక్కువగా వుంటుంది. ఇక ఏ సమస్య వచ్చినా భయపడడం అనేది స్వతహాగా వీరికి ఉండదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.