Healthhealth tips in telugu

Eye Sight:మీ కంటి చూపు మెరుగుపడాలంటే ఈ జ్యూస్ తాగండి

Eye Sight:మీ కంటి చూపు మెరుగుపడాలంటే ఈ జ్యూస్ తాగండి.. ఈ మధ్య కాలంలో కంప్యూటర్ మరియు ఫోన్స్ వాడకం ఎక్కువ అవ్వటం వలన కంటికి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

క్యారెట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటికి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. క్యారెట్ ని పచ్చిగాను తినవచ్చు. అలాగే జ్యూస్ చేసుకొని తాగవచ్చు. క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి వ్యాధులను తగ్గించటానికి సహాయపడుతుంది.
Carrot
క్యారెట్ తో జ్యూస్ ఎలా తయారుచేయాలో చూద్దాం. రెండు క్యారెట్లను తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత రెండు కమలాలను తొక్క తీసి తొనలుగా విడతీసి పైతొక్క తీసి ముత్యాలుగా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక స్పూన్ అల్లం ముక్కలు,కమలా తొనల ముత్యాలను వేయాలి.

ఆ తర్వాత కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఒక కప్పు పండిన బొప్పాయి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ చేసుకొని వడకట్టి జ్యూస్ ని సపరేట్ చేయాలి. ఈ జ్యూస్ లో రెండు స్పూన్ల తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఈ జ్యూస్ రక్షణ వ్యవస్థను ఏక్టివేట్ చేసే సూక్ష్మ పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

క్యారెట్ లో బీటా కెరోటిన్‌ను శరీరం విటమిన్ ఎగా మారుస్తుంది. ఇది దృష్టిని మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.క్యారెట్‌లలో జియాక్సంతిన్ మరియు లుటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కంటి నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. కంటి శుక్లం తగ్గించటంలో సహాయపడుతుంది. గ్లకోమా వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
Weight Loss tips in telugu
అలాగే ఈ జ్యూస్ తాగటం వలన అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. ఉదయం తాగితే అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా పనులు చేసుకోవటానికి అవసరమైన శక్తి లభిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన ఎముకల పెరుగుదల, అభివృద్ధి మరియు మరమ్మత్తు కోసం కూడా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.