Beauty Tips

Face Glow Tips:పెరుగుతో ఇలా చేస్తే ముఖం పై ఏ సమస్యలైనా సరే.. మాయం..

Face Glow Tips:పెరుగుతో ఇలా చేస్తే ముఖం పై ఏ సమస్యలైనా సరే.. మాయం.. ముఖ సంరక్షణలో మనం పెద్దగా ఖర్చు పెట్టనవసరం లేదు. ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది.

ఈ మధ్య కాలంలో వాతావరణంలో కాలుష్యం, ఒత్తిడి, సరైన పోషణ చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో ముఖం మీద జిడ్డు,దుమ్ము పేరుకుపోయి ముఖం చాలా నిర్జీవంగా కనపడుతుంది.

చర్మ సమస్యలకు పెరుగు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో మన చర్మానికి మేలు చేసే లాక్టిక్ యాసిడ్ సమృద్దిగా ఉంటుంది. పెరుగు మన చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

అంతేకాకుండా ముడతలు మరియు ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. ఇది టాన్ మరియు డార్క్ సర్కిల్‌లను తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది.

పెరుగు తీసుకోవడం వల్ల మన చర్మానికి మేలు జరుగుతుంది. మీరు కాటన్ ఉపయోగించి నేరుగా చర్మంపై అప్లై చేసి 10 నుండి 15 నిమిషాలు వదిలి, ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

లేదంటే పెరుగులో నిమ్మ, ఓట్స్, తేనె మొదలైన పదార్థాలను కలిపి ప్యాక్ తయారుచేసుకొని ముఖానికి రాసినా మంచి ప్రయోజనం ఉంటుంది. పెరుగును ముఖానికి రాస్తూ.. ప్రతి రోజు ఒక కప్పు పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలి.

చర్మం తెల్లగా కాంతివంతంగా మెరవాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. మన ఇంటిలోనే సులభంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ముఖం తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.