Toothache : ఈ అద్భుతమైన ఆకు సహాయంతో పంటి నొప్పిని పొగొట్టుకోండి
Toothache Home Remedies : ఈ అద్భుతమైన ఆకు సహాయంతో పంటి నొప్పిని పొగొట్టుకోండి.. పళ్ళు పసుపు రంగులో ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా నలుగురిలో మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి తులసి ఆకులు చాలా బాగా సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. .
ప్రతి రోజు 5 లేదా 6 తులసి ఆకులను నమిలి తింటే పళ్ళు తెల్లగా బలంగా ఉండటమే కాకుండా నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులు ఉండవు. పళ్ల మీద శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ లేకపోతే చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. తులసి ఆకులలో 71% యూజీనాల్, 20% మిథైల్ యూజినాల్ ఉంటాయి. ఇవి పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
తులసి ఆకులో కార్వాక్రోల్, టెర్పెన్ వంటి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన నోటిలో క్రిములపై పోరాటం చేసి నోటి ఇన్ఫెక్షన్లను తగ్గించటమే కాకుండా నోటిని శుభ్రంగా ఉంచుతుంది. తులసి ఆకుల పొడిలో ఆవనూనె కలిపి టూత్‌ఫేస్ట్‌గా వాడుకోవచ్చు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చిగురువాపును తగ్గించటానికి సహాయపడతాయి.
తులసి ఆకులు నమిలితే.. పళ్లు తెల్లగా మారతాయి. తులసి ఆకులను ఎండలో ఎండబెట్టి.. పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని టూత్‌పేస్ట్‌లో వేసి, రోజుకు రెండు సార్లు పళ్లు శుభ్రం చేసుకోండి. తులసిలోని సహజమైన బ్లీచింగ్ గుణాలు 7 రోజుల్లో దంతాలను తెల్లగా మారుస్తాయి.అలాగే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
తులసి మొక్క దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. కాస్త శ్రద్ద పెట్టి రోజుకి 5 లేదా 6 ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగితే పళ్ళ మీద పసుపు రంగు,గార తొలగిపోయి తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి. అంతేకాకుండా నోటికి సంబందించిన, దంతాలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.