MoviesTollywood news in telugu

Tollywood:ఈ టీనేజ్ కుర్రాడిని గుర్తు పట్టారా.. లవ్, రొమాంటిక్, యాక్షన్ హీరో..

Tollywood:ఈ టీనేజ్ కుర్రాడిని గుర్తు పట్టారా.. లవ్, రొమాంటిక్, యాక్షన్ హీరో.. టాలీవుడ్ లో ఒక్కో హీరోకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఎనర్జీకి మారుపేరు గా రామ్ పోతినేని గురించి చెబుతూ ఉంటారు. అది యాక్టింగ్ అయినా డాన్స్ అయినా సరే దుమ్మురేపేస్తాడు. చాలా చిన్న వయస్సులో హీరోగా మారిన అతి తక్కువ మంది హీరోలలో ఒకడైన రామ్.. సినిమా సినిమాకి నటనలో వేరియేషన్ చూపిస్తూ.. అతి తక్కువ కాలంలోనే ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్.

ఇక ‘దేవదాసు’ కంటే ముందు తమిళంలో ‘అదయాలమ్’ అనే ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. అప్పటికి రామ్ కు 14 ఏళ్ళు. ఈ షార్ట్ ఫిల్మ్ లో డ్రగ్స్ కు అడిక్ట్ అయిన 18 ఏళ్ళ యువకుడి పాత్రలో రామ్ నటించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్ కు యూరోప్ మూవీ ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది.రామ్ ను దర్శకుడు వై. వి. యస్. చౌదరి వెండితెరకు ‘దేవదాసు’ చిత్రం ద్వారా పరిచయం చేశాడు.

అప్పటికి రామ్ వయస్సు 18 ఏళ్ళే. ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఫస్ట్ సినిమాతోనే ఒక మాస్ హీరోగా అరంగేట్రం చేసిన రామ్ ‘దేవదాసు’ సినిమాకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డ్ అందుకున్నాడు. ఈ సినిమా చూసిన వారందరూ ఇది తన ఫస్ట్ సినిమా కాదు. ఇది తన సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ అనుకునేలా తన నట విశ్వరూపం చూపించాడు.

ఇక ఆ తరువాత ఫైట్స్ విషయంలో తనకంటూ వైవిధ్యం వుండాలని ‘గణేష్’, ‘పండగ చేస్కో’ చిత్రాలలో కూడా నాన్చాక్ ను ఉపయోగించాడు. నాన్చాక్ తెలిసిన చాలా కొద్దిమంది టాలీవుడ్ నటులలో ఒకడైన రామ్ ‘దేవదాసు’ చిత్రంలో ఫైట్స్ కి సంబంధించి ఈ శిక్షణను నేర్చుకున్నాడు. ఈ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు పలుమార్లు గాయపడినప్పటికీ, రామ్ అంకితభావంతో ఆ విద్యను నేర్చుకున్నాడు. రామ్ కు కూడా గాడ్జెట్స్ అంటే బాగా ఇష్టమట.

ఇప్పటివరకు 100 కి పైనే మొబైల్స్ ను యూజ్ చేశాడట. రామ్ మొబైల్ తోనే ఎక్కువసేపు ఉంటాడని అతని సన్నిహితులు కూడా చెప్పేమాట. రామ్, లేటస్ట్ ఫ్యాషన్ బాగా ఫాలో అవుతాడు. అది మూవీ ప్రమోషన్స్, ఇంటర్వూస్, అతని లేటెస్ట్ ఫోటోషూట్స్, ఫంక్షన్స్ వంటి వాటిల్లో ఈ విషయాలు గమనించవచ్చు.

రామ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉండడానికి కారణం అతని స్మైల్ అని చెప్పాలి. ఇక సిగ్గు పడుతుంటే, అమ్మాయిలంతా ఫ్లాట్ అవ్వాల్సిందే. టాలీవుడ్ లో గొప్ప డాన్సర్ ఎవరు అంటే ముందుగా చిరంజీవి పేరు ప్రస్తావిస్తాం. ఇప్పటి జనరేషన్ లో చరణ్, తారక్, అల్లు అర్జున్ లతో పాటు రామ్ పేరు కూడా చెప్పొచ్చు. తన ఎనర్జీ మొత్తం తను వేసే స్టెప్పుల్లో బాగా కనిపిస్తుంది.
రామ్ కు మంచి లుక్స్ తో పాటు మంచి మనసు కూడా ఉంది. ఆపదల్లో ఉన్నవాళ్లను ఆదుకుంటూనే ఉంటాడు. ప్రత్యూష ఆర్గనైజషన్ కు అనేకసార్లు విరాళం ఇచ్చాడు. అలాగే స్వచ్ఛ భారత్ లో పాల్గొని తన సేవా దృక్పధాన్ని బహిర్గతం చేసాడు. 

ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా పూరి దర్శకత్వంలో రామ్ నటిస్తోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. స్వాతంత్రదినోత్సవం కానుకగా ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ కానుంది.