Beauty Tips

Face Glow Tips:అందం కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు

Face Glow Tips:అందం కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు .. అందం కోసం వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా సహజసిద్ధంగా…ఇంట్లోనే సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఏ ఏ పదార్థాలు మనకి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

మాయిశ్చరైజర్: మార్కెట్లో మాయిశ్చరైజర్ క్రీమ్ లు చాలా దొరుకుతున్నాయి. వాటి కన్నా తేనె మంచి మాయిశ్చరైజర్ గా మనకి ఉపయోగపడుతుంది.

క్లెన్సర్: చర్మాన్ని శుభ్రపరిచే గుణాలు పెరుగులో చాలా ఎక్కువ. పెరుగు ముఖానికి రాసుకున్న పావుగంట తరవాత చల్లని నీళ్లతో కడిగేసుకుంటే చర్మగ్రంథులు శుభ్రపడతాయి. తేనెను కూడా క్లెన్సర్లా వాడుకోవచ్చు. స్క్రబ్: మెంతి గింజలు నానబెట్టి మెత్తని పేస్టులా చేసి దానిని ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. 
ఆ పేస్టును పదిరోజుల వరకు స్క్రబ్ లా వాడుకోవచ్చు.

బ్లీచ్: పార్లర్ లలో పెట్టే బ్లీచ్ కొందరికి పడదు. దాని వల్ల ఇతర సమస్యలు కూడా వస్తుంటాయి. పెరుగు, తేనె, నారింజ, నిమ్మ, పైనాపిల్ పండ్ల రసాలు బ్లీచింగ్ బాగా చేస్తాయి.

కండిషనింగ్: సాధారణ, జిడ్డు చర్మతత్వాలు ఉన్న వారు గుడ్డులోని తెల్ల సొనను, పొడి చర్మం ఉన్న వారు గుడ్డులోని పచ్చసొనను కండిషనింగ్ కు వినియోగించుకోవాలి.

మచ్చలు పోయేందుకు: ఇంట్లోనే చిన్న కలబంద మొక్కని పెంచుకోవడం చాలా సులువు. కాలిన గాయాలకి, ఎండ వల్ల కమిలిన చర్మానికి కలబంద జెల్ బాగా పనిచేస్తుంది. దీనిని రోజు రాసుకుంటే నల్లటి మచ్చలు కూడా మాయమవుతాయి.