Joint pains:ఈ నూనెలో కర్పూరం కలిపి రాస్తే నొప్పులు అన్నీ మాయం
Joint pains:ఈ నూనెలో కర్పూరం కలిపి రాస్తే నొప్పులు అన్నీ మాయం .. మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వచ్చినప్పుడు మందుల జోలికి వెళ్ళకుండా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన వ్యాయామం చేయకపోవటం, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వలన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించటానికి ఒక అద్భుతమైన నూనెను తయారుచేసుకుందాం.
దీని కోసం 100 ml ఆవనూనెలో 10 కర్పూరం బిళ్ళలు వేసి ఒక గంట సేపు అలా ఉంచితే కర్పూరం ఆవనూనెలో కలిసిపోతుంది. ఈ నూనెను సీసాలో పోసి నిల్వ చేసుకోవచ్చు. నొప్పులు ఉన్న ప్రదేశంలో ఈ నూనెను రాశి రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తే నొప్పులు తగ్గుతాయి. నొప్పులు తక్కువగా ఉన్నప్పుడు ఈ నూనె చాలా బాగా సహాయపడుతుంది.
నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పిన చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కర్పూరం నొప్పి, వాపుకు అద్భుతంగా పనిచేస్తుంది. కర్పూరాన్ని చర్మంపై రాసిన వెంటనే ఇది నొప్పికి కౌంటర్ గా చికాకుగా కలిగిస్తుంది, అందువల్ల నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం పొందటానికి దీన్ని ఉపయోగిస్తారు.
ఇది చర్మం యొక్క ఇంద్రియ నరాల చివరల తిమ్మిరిని కలిగిస్తుంది, తద్వారా నొప్పి మరియు మంటను తొలగిస్తుంది. ఆవనూనెలో సెలీనియం ఉండుట వలన నొప్పులను తగ్గిస్తుంది. శరీరమంతా రక్త ప్రవాహం మరియు ప్రసరణను పెంచడం ద్వారా నొప్పులను చాలా సమర్ధవంతంగా తగ్గిస్తుంది.
ఆవ నూనెలో చాలా సమృద్ధిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన కీళ్ళనొప్పులతో సంబంధం ఉన్న కీళ్ల దృడత్వం మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.