Devotional

Sravana Masam 2024:శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…మీ రాశి ఉందా..?

Sravana Masam 2024:శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…మీ రాశి ఉందా.. ఆగస్టు 05వ తేది నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

శ్రావణమాసం వచ్చిందంటే ఎన్నో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పూజలు ఉండి ఎంతో హడావిడిగా ఉంటుంది. కొంతమంది జాతకాలను నమ్ముతారు. అలాగే కొంతమంది జాతకాలను అసలు నమ్మరు. అయితే కొంతమందికి ఈ శ్రావణ మాసంలో జాతకాలలో ఉన్న దోషాలు తొలగిపోయి ఈ శ్రావణమాసంలో అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి చాలా మంచి జరుగుతుంది.

కుంభరాశి
శ్రావణమాసంలో కుంభ రాశికి అధిపతి అయిన శని ఎన్నో ప్రయోజనాలను అందిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ వస్తుంది. కుటుంబంలో కలతలు లేకుండా సంతోషంగా ఉంటారు. వ్యాపారం చేసే వారికి ఆదాయం కూడా పెరుగుతుంది.

మకర రాశి
శ్రావణమాసంలో మకర రాశికి కూడా శని అధిపతిగా ఉంటారు. అందువలన సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి స్థాయిలో ఉండటానికి సహాయపడుతుంది.

తులా రాశి
తులా రాశికి అధిపతి శుక్రుడు కారణంగా ఈ శ్రావణమాసంలో ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. వీరికి సంపద, విజయం, గౌరవం అన్ని దక్కి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి కూడా ఈ శ్రావణ మాసంలో శని దేవుడు దయ చూపిస్తున్నారు. శ్రావణమాసం ఈ రాశి వారికి చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు అన్ని అనుకున్న విధంగా అనుకున్న సమయంలో జరుగుతాయి. దాంతో చాలా ఆనందంగా ఉంటారు.

వృషభ రాశి
ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ శ్రావణమాసంలో ఈ రాశి వారికి ఆదాయం బాగా పెరగడమే కాకుండా ఉన్నత పదవి వస్తుంది. అలాగే సమాజంలో గౌరవం పెరిగి ఆనందంగా గడుపుతారు.