Kitchenvantalu

Minapappu Pachadi :వేడి అన్నంలోకి కారంగా ఎంతో రుచిగా ఉండే పాతకాలం కమ్మటి మినపప్పు పచ్చడి

Minapappu Pachadi :వేడి అన్నంలోకి కారంగా ఎంతో రుచిగా ఉండే పాతకాలం కమ్మటి మినపప్పు పచ్చడి.. మినపప్పు పచ్చడి..టిఫిన్ చెట్నీస్ అనగానే,పల్లీ ,కొబ్బరి ,టమాటోనే చేస్తూ ఉంటాం.

రొటీన్ గా చేసే ,ఈ చెట్నీస్ కాకుండా,ఆంధ్ర స్టైల్ మినపప్పు చెట్నీ ట్రై చేయండి.టిఫిన్స్ లోకే కాదు భోజనంలోకి కూడా టేస్ట్ అదిరిపోతుంది.ఒక సారి చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది మినపప్పు పచ్చడి.

కావాల్సిన పదార్దాలు
నల్ల మినుములు – ½ కప్పు
ఎండుమిర్చి – 8
జీలకర్ర – 1 టీస్పూన్
మెంతులు – 1 టీ స్పూన్
చింతపండు – నిమ్మకాయ సైజ్
బెల్లం – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
నూనె – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.స్టవ్ పై మందపాటి, పాన్ పెట్టుకుని, అందులోకి, ఒక టెబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అందులో మినుములు సువాసన వచ్చేవరకు వేయించుకోవాలి.

2. ఇప్పుడు మినపప్పును పక్కన పెట్టుకుని చల్లార నివ్వాలి,

3. ఇప్పుడు అదే పాన్ లో ఆయిల్ వేసుకుని అందులోకి మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి, వేసి వేయించుకోవాలి.

4. వేయించిన పదార్దాలు అన్నిటిని, మిక్సీ జార్లోకి వేసుకుని, అందులోకి వెల్లుల్లి బెల్లం, ఉప్పు, మరియు చింతపండు పేస్ట్ వేసుకుని, కొద్దిగా వేడినీటని కూడా కలుపుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

5. ఇప్పుడు నూనె వేడి చేసుకుని, తాళింపు పెట్టుకుని, గ్రైండ్ చేసిన మినపచెట్నీని, తాళింపులో వేసుకోండి.

6. అంతే మినప్పప్పు చెట్నీ రెడీ.