AP Dwcra Women: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ఎన్ని లక్షలు ఇస్తున్నారంటే..
Andhra Pradesh Dwcra Women Good News: ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రుణాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రుణం ఇవ్వడంతో పాటుగా 35శాతం వరకు రాయితీని కూడా ప్రకటించింది.
అంటే రూ. లక్ష రుణం తీసుకుంటే.. అందులో రూ.35వేలు రాయితీ కింద మినహాయింపు ఉంటుంది. అలాగే ఒక్కో మహిళకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తారు. రుణంలో మిగిలిప మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని .. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలతో కారంపొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరెన్నో రకాల యునిత్స్ ని ఏర్పాటు చేసుకొని మహిళలు స్వయంశక్తితో ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష.
అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది నిజంగా మహిళలకు శుభవార్త అని చెప్పవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.