Face Glow Tips:ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మేకప్ లేకుండా న్యాచురల్ గానే మెరిసిపోతారు
Face Glow Tips:ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మేకప్ లేకుండా న్యాచురల్ గానే మెరిసిపోతారు.. ముఖం అందంగా తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం వేల కొద్ది డబ్భును ఖర్చు చేస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు.
అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చులో ముఖం మీద మచ్చలు లేకుండా మెరిసేలా చేసుకోవచ్చు.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ బీట్ రూట్ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వేపాకుల పౌడర్, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani Mitti ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, సరిపడా రోజ్ వాటర్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది. ఈ రెమెడీని పాటిస్తే మేకప్ పై ఆధారపడాల్సిన అవసరమే ఉండదు.
బీట్ రూట్ పొడిలో ఉన్న లక్షణాలు చర్మ ఛాయను మెరుగు పరుస్తాయి. వేపాకుల పొడి, పసుపులో ఉన్న లక్షణాలు మొండి మొటిమలు,మచ్చలను మాయం చేస్తాయి. ముల్తానీ మట్టి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కాబట్టి ఈ ప్యాక్ వేయటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.