Devotional

Tirumala Tickets: తిరుమల భక్తులకు అలర్ట్.. ఈనెల 22 నుంచి ఆ టికెట్లు రోజుకు వెయ్యి మాత్రమే..

Tirumala Tickets: తిరుమల భక్తులకు అలర్ట్.. ఈనెల 22 నుంచి ఆ టికెట్లు రోజుకు వెయ్యి మాత్రమే.. తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారి సంఖ్య రోజు రోజుకి భారీగా పెరగటంతో టీటీడీ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో మరింత ప్రాదాన్యత కల్పిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం బుక్ చేసుకునే శ్రీవాణి టికెట్ల పరిమితిని తగ్గించింది. ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఉన్న టికెట్లను అందుబాటులో ఉంచనుండగా.. ఆఫ్‌లైన్‌లో మాత్రం శ్రీవాణి టికెట్ల జారీ సంఖ్యను వెయ్యికి పరిమితం చేయాలని నిర్ణయించింది.

జులై 22 వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక ఈ వెయ్యి టికెట్లలో తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను.. మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన అందించనున్నారు.

ఇక మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు రేణిగుంట ఎయిర్‌పోర్టులోని కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లలో అందుబాటులో ఉంచనున్నారు. అయితే బోర్డింగ్‌ పాస్‌ ఉన్న వారికి మాత్రమే తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ కౌంటర్‌లో ఈ ఆఫ్‌లైన్‌ శ్రీవాణి టికెట్లు జారీ చేయనున్నారు.

శ్రీవాణి దర్శనం చేసుకునే భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా తిరుమల శ్రీవారిని అతి దగ్గరగా దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ వీలు కల్పిస్తుంది. అందుకే శ్రీవాణి టికెట్లకు అంత డిమాండ్ ఉంది. ఇక శ్రీవాణి టికెట్ల కింద వచ్చే రూ.10 వేలు.. ఇందులో రూ.500 టీటీడీకి.. మిగిలిన రూ.9500 శ్రీవాణి ట్రస్ట్‌లో జమ అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.