Wrinkles:ఈ నూనె వాడితే ముడతలు మాయం అయ్యి 60 లో కూడా 20 ఏళ్ల లుక్ తో కనిపిస్తారు
Wrinkles:ఈ నూనె వాడితే ముడతలు మాయం అయ్యి 60 లో కూడా 20 ఏళ్ల లుక్ తో కనిపిస్తారు.. చర్మంపై ముడతలు వచ్చాయంటే మనలో చాలా మంది కంగారు పడి ముడతలను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అదే చిన్న వయస్సులో ముడతలు వస్తే వారి బాధను మాటల్లో చెప్పలేము. ముడతలు రావటానికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిని తగ్గించుకోవటానికి ఖరీదైన లోషన్స్,క్రీమ్స్ వాడుతూ ఉంటారు.
అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. 20 బిర్యానీ ఆకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత 10 యాలకులను వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసి కాస్త వేడి అయ్యాక బిరియాని,యాలకుల పొడి వేసి పది నిమిషాలు మరిగించాలి.
ఆ తర్వాత చల్లారాక ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను ముఖానికి,మెడకు రాసి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే ముడతలు క్రమంగా తగ్గుతాయి.
బిరియాని ఆకు, యాలకుల్లో ఉన్న పోషకాలు చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తాయి. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేసి ముడతలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముడతలను తగ్గించుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.