Beauty Tips

Oil For Hair Growth: జుట్టు ఎక్కువగా రాలుతుందా.. ఈ నూనె రాస్తే.. మీ జుట్టు వద్దన్నాపెరుగుతుంది

Oil For Hair Growth: జుట్టు ఎక్కువగా రాలుతుందా.. ఈ నూనె రాస్తే.. మీ జుట్టు వద్దన్నాపెరుగుతుంది.. జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరగటానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన వస్తువులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. జుట్టు రాలే సమస్యకు ఒక నూనెను తయారుచేసుకుందాం.
hair fall tips in telugu
ఒక గిన్నెలో రెండు స్పూన్ల కాఫీ పొడి, ఒక స్పూన్ లవంగాల పొడి, రెండు స్పూన్ల డ్రై రోజ్ మేరీ ఆకులు, ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసి అన్నీ బాగా కలిసేలా కలిపి పొయ్యి మీద పెట్టి 15 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన నూనె కాస్త చల్లారాక వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రాత్రి సమయంలో తలకు పట్టించి cap పెట్టుకోవాలి.
Rosemary
మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె వాడటం వలన తెల్లజుట్టు నల్లగా మారుతుంది. రోజ్ మేరీ హెయిర్ ఫోలికల్స్‌కు రక్త సరఫరా బాగా జరిగేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది.

తల మీద చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేసి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. లవంగాలు కూడా జుట్టు పెరుగుదలకు ప్రోత్సాహం ఇస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్ జుట్టు పెరుగుదలకు సహాయపడటమే కాకుండా తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.