IRCTC Ooty Tour : ‘ఊటీ’వెళ్ళే ఆలోచనలో ఉన్నారా.. తక్కువ ధరలో మంచి ప్యాకేజీ..
IRCTC Hyderabad Ooty Package: తక్కువ ధరలో ఊటీ అందాలను చూడాలని అనుకొనే వారికీ IRCTC మంచి ప్యాకేజీ తీసుకువచ్చింది. ULTIMATE OOTY EX HYDERABAD పేరుతో ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది.
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని 30-జులై 2024వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి రైలు జర్నీ ఉంటుంది.
మొదటి రోజు హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు(Train No.17230) లో జర్నీ ప్రారంభం అయ్యి..నైట్ అంతా జర్నీలో ఉంటారు.
రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్(Railway Station) కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి చేరుకొని హోటల్‌లోకి చెకిన్ అవ్వాలి. ఆ తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపించి రాత్రి భోజనం చేసి ఊటీలోనె రాత్రి ఉంటారు.
మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూసి.. రాత్రికి ఊటీలో బస ఉంటుంది.
నాల్గో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే బస ఉంటుంది.
అయిదోవ రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళి.. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి.
ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీనితో టూర్ ప్యాకేజీ పూర్తి అవుతుంది.
ప్యాకేజీ ధరల విషయానికి వస్తే.. కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 28940.. డబుల్ షేరింగ్ కు రూ. 16430.. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13380గా నిర్ణయించారు. మార్చి, ఏప్రిల్, మే మాసంతో పోల్చితే ధరలు రూ. 2వేల వరకు తగ్గాయి.
స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 10930.. డబుల్ షేరింగ్ కు రూ. 13980.. సింగుల్ షేరింగ్ కు రూ. 26480 గా ఉంది. ఈ క్లాస్ లో కూడా గతంతో పోల్చితే 2వేల రూపాయల వరకు ధర తగ్గింది.
ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.