Hair Care Tips:దువ్వుకున్నా ప్రతిసారి జుట్టు రాలుతుందా… ఇలా చేస్తే సరి..
Hair Care Tips:దువ్వుకున్నా ప్రతిసారి జుట్టు రాలుతుందా… ఇలా చేస్తే సరి… జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.
జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. వంటింటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
ఈ మధ్యకాలంలో మనలో చాలా మంది జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి అనేక రకాల జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల నూనెలను వాడుతూ ఉంటారు. అయితే ఆ నూనెలలో కెమికల్స్ ఉండటం వలన జుట్టుకు కొంత హాని కలిగే అవకాశం ఉంది. .
అలా కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి నూనె తయారు చేసుకుని వాడితే చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్, జుట్టు రాలే సమస్య ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మూడు అంగుళాల అల్లం ముక్కని తీసుకుని తొక్క తీసి తురుముకోవాలి.
ఆ తర్వాత రెండు స్పూన్ల లవంగాలను తీసుకుని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి. ఆ తర్వాత తురిమిన అల్లం. లవంగాల పొడి వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు మరిగించాలి. అల్లంలో ఉండే తడి మొత్తం ఇంకిపోయే వరకు నూనెను మరిగించాలి. పొయ్యి ఆఫ్ చేసి నూనెను చల్లార్చి వడగట్టి… ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. .
ఈ నూనె దాదాపుగా నెలరోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ నూనెను జుట్టుకు రాసుకోవడానికి ముందు డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయాలి. జుట్టు కుదుళ్ల నుండి చివర్ల బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు సమస్య, జుట్టు రాలే సమస్య, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటివి ఏమీ లేకుండా జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది.
లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చుండ్రు., దురద,ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి వాటిని తొలగించి జుట్టు బలంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అల్లం లో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.