Devotional

Lakshmi Devi:లక్ష్మీ దేవి అనుగ్రహం ఎలా పొందాలో మీకు తెలుసా?

Lakshmi Devi:లక్ష్మీ దేవి అనుగ్రహం ఎలా పొందాలో మీకు తెలుసా.. మన జీవితంలో లక్ష్మి దేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. లక్ష్మి దేవి అనుగ్రహం ఉంటే మనకు జీవితంలో చాలా వరకు సమస్యలు లేనట్టే..

నేటి సమాజంలో మనిషికి గాలి, నీరు, తిండి ఎంత అవసరమో డబ్బులు కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని అవ్వటం లేదు. కొంత మందికి ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవక ఖర్చు అయ్యిపోతు ఉంటుంది. మరి లక్ష్మి దేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలంటే కొన్ని నియామాలను పాటించాలి.

అలాగే కొన్ని తప్పులను కూడా చేయకూడదు. ఈ వీడియోలో లక్ష్మి దేవి అనుగ్రహం ఉండాలంటే ఏ తప్పులు చేయకూడదు… ఏ నియమాలు పాటిస్తే లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుందో వివరంగా తెలుసుకుందాం. డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పెడితే లక్ష్మి దేవి ఆ ఇంటిలో ఉండదట. డబ్బులను కొన్ని ప్రత్యేకమైన దిక్కులలో భద్రపరిస్తే లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుంది.

నగదును తూర్పు దిక్కులో లాకర్ లో పెట్టాలి. నగదును ఎప్పుడు దక్షిణ దిక్కుగా పెట్టకూడదు. అలాగే బాత్ రూమ్ ఎదురుగ డబ్బును భద్రపరిచే లాకర్ ని పెట్టకూడదు. లాకర్ ని ఎప్పటికప్పుడు దుమ్ము,ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి. కొంతమంది లాకర్ లో లక్ష్మి దేవి ప్రతిమ లేదా ఫోటో పెడుతూ ఉంటారు. అలంటి వారు లక్ష్మి దేవి పక్కన రెండు ఏనుగులు ఉన్న ప్రతిమ లేదా ఫోటో పెట్టుకోవాలి. మంగళవారం అప్పు ఇవ్వకూడదు. అప్పు తీసుకోకూడదు.

ఇలా చేస్తే లక్ష్మి దేవి అలిగి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. వంటగది ఈశాన్యంలో కట్టకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు కారణం ఇంట్లో ధన లక్ష్మీ నిలవదనే అలా చెబుతారు. ఆలా కడితే లక్ష్మీ అలిగి వెలిపోతుందంట. సాయంకాలం నిద్రించే వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. సోమరిగా ఉండే వారి ఇంట్లో కూడా లక్ష్మి దేవి ఉండదు. ప్రతి రోజు నిత్య దీపారాధన చేయాలి. ఆలా చేయని వారి ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.