Meena Rasi: మీన రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ఉంటారో తెలిస్తే.. నమ్మలేని నిజాలు
Meena Rasi: మీన రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ఉంటారో తెలిస్తే.. నమ్మలేని నిజాలు.. ఈ మధ్య కాలంలో జాతకాలను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. మీన రాశి వారి ప్రవర్తన ముఖ్యంగా తమ జీవిత భాగస్వామితో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మనలో కొంత మంది జాతకాలను విపరీతంగా నమ్ముతారు.
ఎలా రాసిపెట్టి ఉంటే ఆలా జరుగుతుంది అనే మాట వింటుంటాం. ఒకవేళ జీవితంలో ఇబ్బందులు ఎక్కువైతే, జాతకం చెప్పించుకుని ,ఉపశమనం కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే రాశుల వారీగా జాతక ఫలాలు ఉంటాయి. నక్షత్రం వారీగా కొందరు జాతకం చెబుతారు.ఇక రాశుల్లో మీన రాశికి ఓ ప్రత్యేకత వుంది. ఎందుకంటే ఈ రాశివారికి భూదేవి అంతటి ఓర్పు ఉంటుంది.
ఆకాశమంతా విశాలమైన మనస్సు కూడా వీరి సొంతం. ప్రతి విషయాన్నీ మెచ్యూరిటీ ఆలోచిస్తారు. నిండుకుండ లాంటి మనస్సు ఉన్నప్పటికీ ఏదైనా చిన్న సమస్య వస్తే, వారు చేసే హడావిడి మాములుగా ఉండదు. ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నా, చిన్నపాటి సమస్య వస్తే, అసలు తట్టుకోలేరు.ఈ రాశివారికి సమస్య వస్తే, వారు ఇబ్బంది పడడం కాకుండా కుటుంబాన్ని కూడా ఇబ్బంది పడేలా వ్యవహారం ఉంటుంది.
తమకున్న దాంట్లో ఎదుటివారికి కాస్త ఇవ్వాలనే ఆలోచన వీరికి అధికంగా ఉంటుందే తప్ప ఎదుటి వారి నుంచి ఆశించే పరిస్థితి మాత్రం ఉండదు. ఉపకారం చేసి, ప్రతిఫలం కూడా ఈరాశివారు ఏమాత్రం ఆశించరు. మీనరాశి వారితో ఫ్రెండ్ షిప్ చేసేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగేలా వుంటుందే తప్ప, తేడా ఉండదు.అందుకే మీనరాశి వారితో స్నేహం చేయడానికి ఎక్కువమంది ఇష్టపడతారు.
ఒకసారి స్నేహం చేస్తే దీర్ఘకాలం కొనసాగిస్తారు. ఎవరైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే, ముందుగా మీనరాశి వారు అక్కడికి వెళ్లి తనకు తగినంత సాయం చేయడం , తోడ్పాటు అందించడం చేస్తారు. సరిగ్గా ఇదే మనస్తత్వం జీవిత భాగస్వామి పట్ల కూడా ఈరాశివారు కలిగి వుంటారు. జీవిత భాగస్వామి కి ఏదైనా కష్టం వచ్చినా,నష్టం వచ్చినా కొంత హడావిడి పడినప్పటికీ వెంటనే స్పందించి , సమస్యను గట్టెక్కించే ప్రయత్నం చేస్తారు
ఈ రాశివారు. ఇక చాలా మంచి సుగుణం ఏమిటంటే ఎంత ఇబ్బంది ఉన్నాసరే,పరుష పదం వీరినోటి వెంట రానేరాదు. సున్నితంగా వ్యవహరిస్తారు. ఆఫీసుల్లో గానీ మరోచోట గానీ ఎవరైనా తప్పుచేస్తే మందలించే ప్రయత్నం చేస్తారు. అయిదు ఒకటి రెండు సార్లు చెప్పినా వినకపోతే ఇక దాన్ని వదిలేసి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద మీనరాశి వారు జీవిత భాగస్వామితో సున్నితంగానే వుంటారు కనుక ఎలాంటి గొడవలకు తావుండదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.