Beauty Tips

White Hair Home Remedies: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. వారానికి ఒకసారి ఇలా చేయండి..!

White Hair Home Remedies: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. వారానికి ఒకసారి ఇలా చేయండి.. తెల్లజుట్టు రావటం ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాస్త శ్రద్దగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా మన జీవితాల్లో ఎన్నో రకాల మార్పులు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. ఇలా .తెల్ల జుట్టు సమస్య రాగానే చాలా కంగారు పడిపోయి తెల్ల జుట్టును కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.

ఇలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకునే ఇంటి చిట్కాల ద్వారా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు
దీని కోసం మనం నీటిని తయారుచేసుకుని పదిహేను రోజుల పాటు ఫ్రిజ్లో నిల్వ చేసుకొని వాడితే మంచి ఫలితం కనబడుతుంది.తెల్ల జుట్టు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ టీ పొడి, రెండు బిర్యానీ ఆకులు, ఒక వెల్లుల్లిపాయ వేసి బాగా మరిగించాలి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగుస్తే మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్ లోని పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడగట్టి దీనిలో కొంచెం కొబ్బరి నూనె కలపాలి. ఈ నీటిని జుట్టుకు బాగా పట్టించాలి. తలస్నానం చేసి అరిన జుట్టుకు ఈ నీటిని పట్టించాలి.

అరగంటయ్యాక సాధారణమైన నీటితో తల స్నానం చేయాలి. ఆరోజు తలకు షాంపూ పెట్టకూడదు .మరుసటి రోజు తలకు షాంపూ పెట్టొచ్చు. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది అలాగే జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య వంటి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఓపిక.గా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.