Beauty Tips

Flax Seeds:అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందమూ మీ సొంతం!

Flax Seeds: అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందమూ మీ సొంతం.. అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పోషకాహార లోపం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా పాడవుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి చర్మ సమస్యలు వేధిస్తాయి.

ఈ మధ్య కాలంలో వాతావరణంలో కాలుష్యం, దుమ్ము,ధూళి కారణంగా ముఖం మీద ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా మనకు సహజసిద్దంగా దొరికే మూడు వస్తువులను ఉపయోగించి ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు,ముడతలు లేకుండా తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాన్ని ఇస్తుంది.

రాత్రి సమయంలో ఒక బౌల్ లో ఒక స్పూన్ Flax Seeds వేసి నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే బ్యూటీ పార్లర్ కి వెళ్ళిన రాని glow వస్తుంది. Flax seeds లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్దిగా ఉంటాయి.

ఇవి చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మొటిమలను తగ్గించటమే కాకుండా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం మృదువుగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ వేసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.