Kitchenvantalu

Aloo Gobi Paratha:ఆలూ గోబీ పరాఠాని ఇలా చేసుకోండి.. సాఫ్ట్ గా సూపర్ గా ఉంటుంది

Aloo Gobi Paratha:ఆలూ గోబీ పరాఠాని ఇలా చేసుకోండి సాఫ్ట్ గా సూపర్ గా ఉంటుంది..ఆలు గోబీ పరాటా..ఇడ్లీ, వడా,దోశ, పూరి, ఉప్మా, డైలీల్ రొటీన్ టిఫిన్స్.
ఈ మెనూలో ఆలు గోబీ పరాటా యాడ్ చేసుకుంటే,కాస్త టైమ్ తీసుకున్నా,పిల్లలకు రుచికరమైన ,ఆరోగ్యకరమైన,టిఫిన్ అవుతుంది.

లంచ్ బాక్స్ లోకి ఇది కాని చేసారంటే, బలానికి బలం టేస్ట్ కు టేస్ట్.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1.5 కప్పు
తురుమిన కాలీ ఫ్లవర్ – 1 కప్పు
నూనె – 2 టీ స్పూన్
ఉప్పు – తగినంత
తురిమన అల్లం – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్ స్పూన్
పసుపు – చిటికెడు
చాట్ మసాలా – ½ టీ స్పూన్
కొత్తిమీర తరుగు -2 టేబుల్ స్పూన్స్
ఉడికించిన బంగాళ దుంపలు – 1 కప్పు
నిమ్మరసం – ½ టీ స్పూన్స్

తయారీ విధానం
1.ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులోకి గోధుమ పిండి వేసి, టేబుల్ స్పూన్ ఆయల్ యాడ్ చేసి, తగినన్ని నీళ్లు పోసుకుంటూ,మెత్తని ముద్దలా తయారు చేసుకోవాలి.
2. కలిపిన చపాతి పిండిని, అరగంట వరకు, నాననివ్వాలి.
3. ఇఫ్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, అందులోకి నూనె వేసి,ఇప్పుడు వేడెక్కిన తర్వాత, తురిమిన అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
4.తర్వాత అందులోకి తరిగిన కాలీ ఫ్లవర్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
5.ఉడికించిన బంగాళదుంప తురుమును యాడ్ చేసి, తేమ పోయే వరకు, మంచి పేస్ట్ లా వేయించుకోవాలి.
6.అందులోకి కారం,చాట్ మసాలా, కొత్తిమీర,తగినంత ఉప్పు, వేసుకుని, స్టవ్ ఆఫ్ చేసి , నిమ్మరసం వేసి,బాగా కలపుకోవాలి.
7. ఇఫ్పుడు ముందుగా తయారు చేసుకున్న పిండిని, చేతిపై పూరీలా ఒత్తుకుని, అందులోకి ఉడికించిన ఆలు మిశ్రమాన్ని స్టప్ చేసుకుని, అందులను మూసి వేసి, రొట్టెల కర్రతో నిదానంగా, ఆలు బయటికి రాకుండా, మందపాటి చపాతి, కాల్చుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, వేడెక్కిన తర్వాత, రోల్ చేసుకున్న పరాఠాను పాన్ పై పెట్టి, రెండు వైపులా, నూనె లేదా బటర్ వేసుకుని దోరగా కాల్చుకోవాలి.
9. అంతే ఆలు గోబీ పరాఠా రెడీ.