Apples:కట్ చేసిన యాపిల్… రంగు మారకుండా ఉండాలంటే..
Apples:కట్ చేసిన యాపిల్… రంగు మారకుండా ఉండాలంటే.. ప్రతి రోజు ఒక Apple తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం ఉండదు. అయితే Apple కోయగానే నిమిషాల్లోనే రంగు మారిపోతూ ఉంటుంది. Apple లో ఉండే ఎంజైమ్ లు గాలితో చర్య జరపడం వల్ల Apples రంగు మారిపోతాయి.
ఇది చాలా సహజమైన ప్రక్రియ, కానీ ఇలా రంగుమారిపోయిన Apples చూడటానికి కాస్త ఎబ్బెట్టుగానూ, తినడానికి అంతగా ఆసక్తిగా అనిపించదు. అలా కాకుండా Apple కట్ చేసిన తరువాత కొన్ని గంటలపాటూ తెల్లగా, తాజాగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే టిప్స్ పాటిస్తే సరిపోతుంది. కాస్త ఓపికగా శ్రద్ద పెడితే సరిపోతుంది.
Apple కట్ చేసిన తర్వాత Apple ముక్కలకు నిమ్మరసం రాయాలి. ఇలా చేస్తే నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ Apple రంగు మారకుండా చేస్తుంది. అలాగే ఎక్కువ సేపు Apple రంగు మారకుండా తాజాగా ఉంటాయి.
Apple ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా ఎర్రగా మారకుండా తాజాగా ఉండటానికి ఉప్పు నీరు కూడా బాగా సహాయపడుతుంది. ముక్కలు కట్ చేసిన వెంటనే ఉప్పు
ఉప్పు నీటిలో వేయాలి. కొద్దిసేపు ఉప్పు నీటిలోనే ఉంచాలి. ఆ తరువాత ముక్కలను బయటకుతీసి సాధారణ నీటితో కడిగి ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ ముక్కల సహజమైన రంగు, రుచి రెండూ అస్సలు మారవు. తాజాగా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.