Hair Care Tips:జుట్టు ఊడిపోతుందని దిగులు పడుతున్నారా.. ఈ చిట్కా ఫాలో అవ్వండి
Hair Care Tips:జుట్టు ఊడిపోతుందని దిగులు పడుతున్నారా.. ఈ చిట్కా ఫాలో అవ్వండి.. జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మారిన వాతావరణ పరిస్థితులు, జీవన శైలి పరిస్థితులు, పోషకాహార లోపం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఇంటి చిట్కాల ద్వారా చాలా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు .
ఒక గిన్నెలో 100 గ్రాముల అవనూనె వేయాలి. దానిలో 4 కుంకుడు కాయలను గింజలు తీసి వేయాలి. ఆ తర్వాత రెండు శీకాయలను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఏడు లేదా ఎనిమిది ఉసిరి ముక్కలను వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కలోంజీ విత్తనాలు వేయాలి.
ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులను వేసి పొయ్య మీద పెట్టి 5 నుంచి 7 నిముషాలు మరిగించాలి. కాస్త చల్లారాక వడగట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు రాసి రెండు గంటలు అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
కుంకుడు కాయలు జుట్టు స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయ పడతాయి. జుట్టు మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది. ఉసిరిముక్కలు జుట్టుకు మంచి పాషణను అందించి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కలోంజీ విత్తనాలు కూడా కూడా జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి.
జుట్టు సంరక్షణలో మెంతులను పురాతన కాలం నుండి వాడుతున్నారు. మెంతులలో ఉండే పోషకాలు జుట్టు రాలకుండా చుండ్రు లేకుండా చేసి జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తాయి. ఆవనూనె కూడా జుట్టు తేమగా ఉండేలా చేసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేసి మంచి ఫలితాన్ని పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.