Kitchenvantalu

Kitchen Hacks:ప్రతి ఇల్లాలు తప్పక తెలుసుకోవాల్సిన వంటింటి చిట్కాలు

Kitchen Hacks:ప్రతి ఇల్లాలు తప్పక తెలుసుకోవాల్సిన వంటింటి చిట్కాలు.. కొన్ని చిట్కాలను ఫాలో అయితే వంట త్వరగా అవ్వటమే కాకుండా చేసే వంటలో పోషకాల కొరత లేకుండా సమృద్దిగా ఉంటుంది.

ప్రతి రోజు చేసే పనులు చాలా వేగంగా అవ్వాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అయితే సమయం కూడా ఆదా అవుతుంది. వంటింటిలో ఈ చిట్కాలను ఫాలో అయితే చిన్న చిన్న సమస్యలకు కూడా అద్భుతమైన పరిష్కారాలను పొందవచ్చు.

ఒక్కోసారి నిమ్మకాయలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటాం. అవి ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పాడైపోతాయి. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే ఎక్కువ రోజులు నిమ్మకాయలు తాజాగా ఉంటాయి. నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడిచి నూనె రాసి, ఒక కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి

బెండకాయ ముక్కలు జిగురు లేకుండా క్రిస్పీగా రావాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా బాగా సహాయపడుతుంది. బెండకాయ ముక్కలను కోసిన తర్వాత కొంచెం పెరుగు వేసి బాగా కలపాలి. ముక్కలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా జాగ్రత్తగా కలిపి ఫ్రై చేయాలి. ఇలా చేస్తే బెండకాయ ముక్కలు క్రిస్పీగా వస్తాయి.

ప్రస్తుతం కూరగాయలను పురుగు మందులతో పండిస్తున్నారు. వీటి మీద ఉన్న పురుగు మందు పోవటానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఒక బౌల్లో నీటిని తీసుకోని దానిలో ఒక స్పూన్ ఉప్పు తీసుకోవాలి. ఆ నీళ్లలో 4 నుంచి 5 స్పూన్ల పసుపు వేయాలి. ఆ నీళ్లలో పళ్ళు, కూర కాయలు వేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లలోంచి తీసి మామూలు వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. వాటిపై ఉన్న బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుంది.

మైక్రోవేవ్ నుంచి వచ్చే చెడు వాసన పోవాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు వెనిగర్, అరకప్పు వాటర్ వేసి బాగా కలపాలి. ఒక నిమిషం తర్వాత మైక్రోవేవ్‌లో పెట్టి ఆన్ చేయాలి. 5 నిమిషాల తర్వాత బౌల్ మైక్రోవేవ్ నుంచి తీసేసి ఒక సాఫ్ట్ క్లాత్‌తో అంతా క్లీన్ చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.