Kitchenvantalu

Potli Samosa:పొట్లి సమోసా.. సమోసానే కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా …

Potli Samosa:పొట్లి సమోసా.. సమోసానే కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా …పొట్లీ సమోసా..ఈవినింగ్ ఒక ఛాయ్ విత్ సమోసా,లాగించామంటే చాలు,డిన్నర్ టైమ్ వరకు కూల్.ఇక సమోసా అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి.

మొదలు పెట్టామంటే,10 సమోసాలు ఈజీగా లాగించేస్తారు.అదే టేస్ట్ తో ఉండే పొట్లీ సమోసాను ఒకసారి టేస్ట్ చేయండి

కావాల్సిన పదార్ధాలు
మైదా – రెండు కప్పులు
నెయ్యి – రెండు స్పూన్లు
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
బంగాళ దుంపలు – 2
కాలీఫ్లవర్ – 1 కప్పు
క్యారేట్ తురుము – 1 కప్పు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
పచ్చిబటానీలు – 1/4కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పసుపు – చిటికెడు
కారం – 1 టీ స్పూన్
కొత్తిమీర – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ముందుగా ఒక కుక్కర్ లో బంగాళదుంపలు , క్యారేట్ లు, కాలీ ఫ్లవర్ను వేసి, తగినన్ని నీళ్లు పోసి, హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి.
2.ఉడికిన కూరగాయలను వడకట్టుకుని, కూరగాయల ముక్కలను మ్యాష్ చేసుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై మరో పాన్ పెట్టుకుని, ఆయిల్ వేసుకుని, అందులోకి జీలకర్ర, కరివేపాకు, వేసి పచ్చి బటానీలు కలపుకుని,కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి,
4. ఇప్పుడు అందులోకి , మిగిలిన ఉప్పు,కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ , పసుపు, కొత్తిమీరను వేసుకుని, గట్టిగా చేసుకుని ,అందులోకి మ్యాష్ చేసుకున్న కూరగాయల ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు అది చల్లార నివ్వాలి.
6. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని , అందులోకి మైదా పిండి, వేసి కొంచం ఉప్పు, నెయ్యి వేసుకుని, బాగా కలపండి.
7. తగినన్ని నీళ్లు పోసుకుంటూ, మెత్తటి చపాతి పిండిలా తయారు చేసి, తడి గుడ్డతో కప్పి , పక్కకు పెట్టండి.
8. 30 నిముషాల తర్వాత, చిన్న చిన్న బాల్స్ ను తీసుకుని, పూరీలా , తయారు చేసుకోవాలి.
9. ఇప్పుడు ఆ పూరి మధ్యలో తయారు చేసుకున్న, వెజిటేబుల్ స్టఫ్ ను పెట్టుకుని, క్లోజ్ చేయాలి.
10. క్లోజ్ చేసిన భాగాన్ని మూతలా తయారు చేసుకోవాలి.
11. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి, అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, స్టవ్ ఆఫ్ చేయాలి.
13. బాగా వేడిగా ఉన్న నూనెలో తయారు చేసుకున్న పొట్లీ సమోసాలను వేసుకోవాలి.
12. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం మంటపై కరకరలాడే విధంగా వేయించుకోవాలి.
13. సమోసాలు గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాక జల్లీ గరిటెతో తీసి పక్కన పెట్టుకోవాలి.
14. అంతే పొట్లీ సమోసా రెడీ అయినట్లే..