White Hair Turn Black:కేవలం 10 నిమిషాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది..
White Hair Turn Black:కేవలం 10 నిమిషాల్లో తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.. తెల్లజుట్టు రావటానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. తెల్లజుట్టును నల్లగా మార్చటానికి ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్లజుట్టు సమస్య నుండి బయట పడవచ్చు. తెల్లజుట్టు సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడకుండా ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే సరిపోతుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి 5 స్పూన్ల బ్లాక్ టీ పొడి, పది తులసి ఆకులు వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి చల్లారబెట్టాలి.
చల్లారిన ఈ నీటిలో అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలపాలి. ఈ నీటిని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
నిమ్మరసం జుట్టు మీద చుండ్రు మరియు ఇన్ఫెక్షన్ సమస్యలను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.