Stretch Marks:స్ట్రెచ్ మార్క్స్ పోవాలా అయితే ఈ హోం రెమెడీస్ ఫాలో అవ్వండి.
Stretch Marks:స్ట్రెచ్ మార్క్స్ పోవాలా అయితే ఈ హోం రెమెడీస్ ఫాలో అవ్వండి… స్ట్రెచ్ మార్క్స్.. మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది ఒకటి. ప్రసవం తర్వాత మహిళలకు స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయి. అదే విధంగా బరువు పెరగడం, తగ్గడం కారణంగా కూడా ఈ మచ్చలు వస్తుంటాయి. కడుపు, భుజాలు, కాళ్లు ఇలా శరీర భాగాలపై ఎక్కువగా వస్తుంటాయి.
ఒత్తిడి వంటి సమస్యల వల్ల కూడా ఇవి శరీర భాగాలపై ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో దొరికే క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఆలోవెరా జెల్, ఒక స్పూన్ ఆముదం, ఒక vitamin e capsule లో నూనెను వేసి బాగా కలపాలి.
ఈ Cream ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్త సమయాన్ని శ్రద్ద పెడితే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.