Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ డ్రై ఫ్రూట్స్‌తో సమస్యను పారదోలదాం..
Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ డ్రై ఫ్రూట్స్‌తో సమస్యను పారదోలదాం.. ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి రక్తంలో యూరిక్ స్థాయిలు పెరగటం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మన శరీరంలో ఒక సేంద్రీయ సమ్మేళనం అయిన యూరిక్ ఆమ్లం రక్తప్రవాహంలో తిరుగుతూ మన శరీరం యొక్క జీవక్రియకు సహాయం చేస్తుంది. ఈ స్థాయిలు ఎక్కువైతే కిడ్నీలు రాళ్ళు, ఆర్థరైటిస్ సమస్యలకు దారితీస్తుంది.
యూరిక్ స్థాయిలు నియంత్రణలో ఉండటానికి రెగ్యులర్ డైట్ లో ఇప్పుడు చెప్పే Dry Fruits తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాదం పప్పు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. ప్రతి రోజు 4 లేదా 5 బాదం పప్పులను తీసుకుంటే మంచిది. బాదం పప్పులో కాల్షియం, ఫైబర్,మెగ్నీషియం,జింక్,కాపర్,విటమిన్ k వంటివి సమృద్దిగా ఉంటాయి. కీళ్ల నొప్పులు,వాపుల నుండి ఉపశమనం కలుగుతుంది.
జీడిపప్పులో పొటాషియం,విటమిన్ సి,ఫైబర్ వంటివి సమృద్దిగా ఉండుట వలన యూరిక్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచటంలో కూడా సహాయపడుతుంది. అలాగే నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు 5 జీడిపప్పులను తీసుకోవటం మంచిది.
వాల్‌నట్స్ ని సూపర్ ఫుడ్ గా చెప్పుతారు. వీటిలో ఒమేగా-3 ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్దిగా ఉండుట వలన శరీరం నుండి యూరిక్ యాసిడ్ ని బయటకు పంపటంలో సహాయపడుతుంది. రోజుకి రెండు వాల్ నట్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది. వాల్ నట్స్ కాస్త ధర ఎక్కువైన దానికి తగ్గట్టుగా ప్రయోజనాలను అందిస్తుంది.
అవిసె గింజలు కూడా శరీరంలో యూరిక్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. అవిసె గింజలలో శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక యూరిక్ యాసిడ్ స్థాయిల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.